ఆక్లాండ్: న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను కోల్పోయిన నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనను ఓదార్చుకునే మాటలు చెప్పాడు. టీ20 ప్రపంచ కప్, ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ నేపథ్యంలో ఈ ఏడాది వన్డే క్రికెట్ కు అంత ప్రాధాన్యం లేదని ఆయన అన్నాడు. రెండు వన్డేల్లోనూ తాము పోరాడిన తీరు సంతృప్తికరంగానే ఉందని చెప్పాడు. 

న్యూజిలాండ్ పై జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా 0-2 స్కోరుతో న్యూజిలాండ్ పై సిరీస్ ను కోల్పోయింది. మూడు వన్డే జరగాల్సి ఉంది. రెండు మ్యాచులు కూడా ఆసక్తికరంగా సాగాయని ఆయన అన్నాడు.

తాము మ్యాచ్ ను ముగించిన తీరుపై తాను సంతృప్తికరంగా ఉన్నట్లు విరాట్ కోహ్లీ తెలిపాడు. లక్ష్యఛేదనలో తొలి భాగంలోనే తాము గతి తప్పామని ఆయన చెప్పాడు. నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా గొప్ప పోరాట పటిమ కనబరిచారని ప్రశంసించాడు. 

Also Read: కోహ్లీ సేనపై ప్రతీకారం... వన్డే సీరిస్ కివీస్ సొంతం

ఈ ఏడాది టీ20లకు, టెస్టులకు ఉన్న పాధాన్యం వన్డే క్రికెట్ కు లేదని చెప్పాడు. ఈ మ్యాచులో తాము అవకాశాలను వాడుకోవాల్సి ఉండిందని, సైనీ ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని తమకు తెలియదని అన్నాడు. ఇటువంటి స్థితిలో యువకులు రాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాము కచ్చితంగా మార్పులు చేస్తామని, ఇక కోల్పోవడానికి ఏమీ లేదని అన్నాడు. మూడో వన్డేలో తప్పకుండా ప్రయోగాలు చేస్తామని చెప్పాడు.

Also Read: జడేజా సూపర్ త్రో... ఔరా అంటున్న నెటిజన్లు