India vs England : రాజ్ కోట్ టెస్టులో భారత్ తొలి అరగంటలోనే 10 ఓవర్లలోపే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
India vs England : రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, తొలి సెషన్ లోనే భారత్ కష్టాల్లో పడింది. మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోనే 10 ఓవర్లు కూడా కాకముందే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్, శుభ్ మన్ గిల్ త్వరగానే ఔట్ అయ్యారు. వరుస వికెట్లు పడుతున్న క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
మూడో టెస్టు మ్యాచ్ లో కష్ట సమయంలో రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పై హాఫ్ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ 70 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. తన ఇన్నింగ్స్ లో 8 బౌండరీలు బాదాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజా 17* పరుగలతో ఆడుతున్నాడు. అంతకుముందు, ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. రజత్ పటిదార్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 5 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్ లో బెన్ డకెట్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దుతున్నారు.
హార్దిక్ పాండ్యాకు ఝలక్.. టీ20 ప్రపంచకప్-2024 లో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ !
INDIA VS ENGLAND: ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు.. !
