India vs England : రాజ్ కోట్ లో జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూటో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ‌రో రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ త‌ర‌ఫును అత‌ను 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు.  

India vs England 3rd Test: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియాలో ప‌లు రికార్డులు న‌మోద‌వుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఇండియా. అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్ ఆడ‌టంతో టెస్టు క్రికెట్ లో మ‌రో రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ తో క‌లిపి అత‌ను 100 టెస్టు అడుతున్నాడు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లాంగ్ త‌ర‌ఫున 100 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడిన 16 ప్లేయ‌ర్ గా బెన్ స్టోక్స్ రికార్డు సృష్టించాడు.

అలాగే, అంత‌ర్జాతీయ క్రికెట్ లో 100 టెస్టు మ్యాచ్ ల‌ను ఆడిన 76 క్రికెట‌ర్ గా బెన్ స్టోక్స్ చ‌రిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరఫున అత్యధికంగా 184 టెస్టులు ఆడిన ఆటగాడిగా జేమ్స్ అండర్సన్ టాప్ లో ఉన్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో మొత్తంగా అత్యధిక 200 టెస్టులు ఆడిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. వివిధ జ‌ట్ల వారీగా చూసుకుంటే అత్య‌ధిక ప్లేయ‌ర్లు 100 టెస్టులు ఆడిన జ‌ట్ల జాబితాలో ఇంగ్లాండ్ టాప్ లో ఉంది. ఇంగ్లాండ్ నుంచి 16 మంది క్రికెట‌ర్లు 100 టెస్టులు ఆడారు. ఆ త‌ర్వాతి స్థానాల్లో భార‌త్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి.

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

Scroll to load tweet…

200 వికెట్ల క్ల‌బ్ లోకి బెన్ స్టోక్స్.. ! 

బెన్ స్టోక్స్ 2013లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు. గత 99 మ్యాచ్‌లలో 36.34 సగటుతో 6251 పరుగులు చేశాడు. 197 వికెట్లు కూడా తీశాడు. 100వ టెస్టు ఆడుతున్న అతను ఈ మ్యాచ్ లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ తో అదరగొట్టాలని చూస్తున్నాడు. 2013లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన బెన్ స్టోక్స్ 36.34 సగటుతో 6251 పరుగులు చేసి ఇప్పటి వరకు ఆడిన 99 మ్యాచ్‌ల్లో 197 వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్‌తో పాటు, గార్ఫీల్డ్ సోబర్స్, జాక్వెస్ కల్లిస్ మాత్రమే టెస్ట్ క్రికెట్‌లో 6000+ పరుగులు, 150+ వికెట్లు డబుల్ సాధించిన ప్లేయర్లుగా ఉన్నారు.

INDIA VS ENGLAND: రాజ్‌కోట్ టెస్టు.. భార‌త్ కు మార్క్ వుడ్ షాక్.. జైస్వాల్, గిల్, ప‌టిదార్ ఔట్..