PBKS vs DC : పృథ్వీ షాకు షాకిచ్చిన ఢిల్లీ.. షాయ్ హోప్ అరంగేట్రం.. నెటిజన్లు షాక్.. !
Tata IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) లో భాగంగా పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రెండో మ్యాచ్ జరిగింది. పంజాబ్ బౌలర్లు రాణించడంతో ఢిల్లీ టీమ్ భారీ స్కోర్ చేయలేకపోయింది.
Punjab Kings vs Delhi Capitals: ముల్లన్‌పూర్‌లోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (పీసీఏ)లో శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారత ఓపెనర్ పృథ్వీ షాకు షాకిచ్చింది. ఓపెనర్ గా జట్టులో చోటుకల్పించకపోగా, మరో కొత్త ప్లేయర్ ను రంగంలోకి దింపింది. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ తో చాలా కాలం తర్వాత రిషబ్ పంత్ బ్యాట్ తో గ్రౌండ్ లోకి దిగాడు. పంత్ ఐపీఎల్ 2022 తర్వాత మొదటిసారిగా జట్టుకు నాయకత్వం వహించాడు. ఘోర కారు ప్రమాదం తర్వాత ఇప్పుడు ఢిల్లీ కెప్టెన్ గా బరిలోకి దిగడంతో క్రికెట్ లవర్స్, పంత్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అయితే, అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షా ను పక్కనబెట్టింది. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 8 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు అత్యుత్తమ ఫామ్‌లో లేడు. అయితే, పృథ్వీ రంజీ ట్రోఫీలో ముంబైకి విజయవంతమైన ప్రచారంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. 9 మ్యాచ్‌లలో 50.11 సగటుతో 451 పరుగులు చేశాడు. అయితే, 159 పరుగుల టాప్ ఇన్నింగ్స్ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. దీంతో ప్రస్తుత మ్యాచ్ లో ఢిల్లీ టీమ్ పంత్ ను తప్పించింది. అతని స్థానంలో కొత్త ప్లేయర్ షాయ్ హోప్ ను తీసుకువచ్చింది.
RCB vs CSK: దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ రఫ్పాడించారు.. !
ముల్లన్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో మాజీ ఫైనలిస్టులు పంజాబ్ కింగ్స్‌తో తలపడటంతో వెస్టిండీస్ వన్డే కెప్టెన్ షాయ్ హోప్ శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు లుంగి ఎన్‌గిడి స్థానంలో ఆస్ట్రేలియా కొత్త బిగ్-హిట్టింగ్ సంచలనం జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ కంటే ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ షాయ్ హోప్‌ను ఎంపిక చేసింది. గత ఐపీఎల్ టోర్నీలో ఫిల్ సాల్ట్, పృథ్వీ షాలతో కలిసి డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఢిల్లీకి చెందిన జట్టు ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్‌ను వార్నర్‌కు కొత్త ఓపెనింగ్ భాగస్వామిగా తీసుకువచ్చింది.
ఐపీఎల్ 2024 ఓపెనర్ కోసం ఢిల్లీ ప్లెయింగ్ 11 నుంచి పృథ్వీ షాను పక్కన పెట్టడంతో నెటిజన్లు, క్రికెట్ లవర్స్ షాక్ అయ్యారు. అతని జట్టు నుంచి తప్పించడం పై విభిన్న కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఐపీఎల్ 2023లో తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో షా విఫలమయ్యాడు. గత ఏడాది ఎనిమిది మ్యాచ్‌లలో, ముంబై స్టార్ కేవలం 106 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వాటిలో 54 పరుగులు ఒకే గేమ్‌లో వచ్చాయి. దీంతో టోర్నీ మధ్యలోనే జట్టులో స్థానం కోల్పోయాడు.