RCB vs CSK: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ సంచ‌ల‌న బ్యాటింగ్ చేశారు.  

CSK vs RCB: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ ఇద్దరూ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. వీరిద్ద‌రు జ‌ట్టుకు శుభారంభం అందించారు. కానీ, 5వ ఓవ‌ర్ లో డుప్లెసిస్ ఔట్ అయిన త‌ర్వాత అదే ఓవ‌ర్ లో ర‌జ‌త్ ప‌టిదార్ వికెట్ ను కోల్పోయింది. ఆ త‌ర్వాతి ఓవ‌ర్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ వికెట్ ను కూడా కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

అప్ప‌టివ‌ర‌కు నెమ్మదిగా ఆడిన విరాట్ కోహ్లీ వేగం పెంచిన క్ర‌మంలో చెన్నై సూప‌ర్ క్యాచ్ తో పెవిలియ‌న్ కు చేరాడు. ఆర్సీబీ 6 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 42 పరుగులకే కుప్పకూలింది. ఈ దశలోనే విరాట్ మ్యాచ్‌లో 10 బంతుల్లో 9 పరుగులు చేసి టీ20 క్రికెట్ చరిత్రలో 12 వేల పరుగులు దాటిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతే కాకుండా సీఎస్కే పై 1000 ప‌రుగులు పూర్తి చేశారు. ఆ త‌ర్వాత వెంట‌నే కామెరాన్ గ్రీన్ 18 పరుగుల వద్ద అవుట్ కావ‌డంతో ఆర్సీబీ 11.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 78 పరుగులు 100 ప‌రుగులైనా పూర్తి చేస్తుందా అనే ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి.

RCB VS CSK: ఎంది గురూ ఇలా ఔట్ చేశారు.. అద్భుత రిలే క్యాచ్ తో కోహ్లీని పెవిలియ‌న్ కు పంపిన ర‌హానే, ర‌చిన్..

అయితే, ఇలాంటి ప‌రిస్థితిలో క్రీజులోకి వ‌చ్చిన దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్ లు అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో రికార్డు భాగ‌స్వామ్యంతో ఆర్సీబీ ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. 6వ వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆర్సీబీకి 173 పరుగులు అందించారు. ఇందులో దినేష్ కార్తీక్ 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనుజ్ రావత్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి మ్యాచ్ చివరి బంతికి ఔట్ అయ్యాడు. రెండు ప‌రుగుల దూరంలో హాఫ్ సెంచ‌రీ కోల్పోయాడు. చివరకు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. బౌలింగ్ విషయానికొస్తే ముస్తాబిజుర్ రెహమాన్ 4 వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ ఒక వికెట్ తీశాడు. తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లు ఏకంగా 47 పరుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

Scroll to load tweet…

Scroll to load tweet…

RCB vs CSK: టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ తొలి భారతీయుడిగా మ‌రో ఘ‌న‌త‌..