రిటైర్మెంట్ ప్లేయర్లతో పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ టీమ్.. జట్టులో ఉన్నది వీరే !
T20 World Cup : టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ జట్టును ప్రకటించింది. రిటైర్మెంట్ నుంచి యూ-టర్న్ తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వాసిమ్‌లు కూడా జట్టులోకి వచ్చారు.
Pakistan squad : వెస్టిండీస్, అమెరికా వేదికలుగా వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. శుక్రవారం అబ్దుల్ రజాక్, అసద్ షఫీక్, బాబర్ ఆజం, బిలాల్ అఫ్జల్, గ్యారీ కిర్‌స్టెన్, మహ్మద్‌లు హాజరై దాదాపు రెండు గంటలపాటు కూలంకషంగా జరిగిన సమావేశం తర్వాత పాక్ జట్టును ప్రకటించారు. జూన్ 2న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్‌లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ జట్టుకు బాబర్ అజామ్ నాయకత్వం వహించనున్నాడు.
టీ20 ప్రపంచకప్ పాకిస్థాన్ జట్టులో అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, సయీమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ లు ఉన్నారు. అలాగే, రిటైర్మెంట్ నుండి యూ-టర్న్ తీసుకున్న మహ్మద్ అమీర్, ఇమాద్ వాసిమ్‌లను కూడా జట్టులోకి తీసుకున్నారు. 2010లో టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన తర్వాత అమీర్ తన రెండవ టీ20 ప్రపంచ కప్‌ను ఆడబోతున్నాడు. పాక్ జట్టులోని 15 మంది సభ్యులలో ఎనిమిది మంది మాత్రమే ఆస్ట్రేలియాలో జరిగిన గత టీ20 ప్రపంచ కప్ ఎడిషన్ లో ఆడినవారు ఉన్నారు.
ఐపీఎల్ హిస్టరీలో యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డు
"యువత, అనుభవాల మేళవింపుతో కూడిన అత్యంత ప్రతిభావంతులైన, సమతుల్యమైన జట్టు ఇది. గత కొంత కాలంగా కలిసి ఆడుతున్న ఈ ఆటగాళ్లు వచ్చే నెలలో జరిగే మెగా ఈవెంట్ కోసం బాగా సన్నద్ధమై సెటిల్ అయ్యారు. హారిస్ రవూఫ్ పూర్తి ఫిట్నెస్ తో నెట్స్ లో బాగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను హెడింగ్లీలో ఔట్ చేసి ఉంటే బాగుండేది, కానీ రాబోయే మ్యాచ్లలో అతను ఎదుగుదలను కొనసాగిస్తాడని మేము నమ్ముతున్నాము, ఎందుకంటే అతను టీ20 ప్రపంచ కప్ లో ఇతర స్ట్రైక్ బౌలర్లతో కలిసి ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు" అని పీసీబీ తన అధికారిక వెబ్సైట్ లో పేర్కొంది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం పాకిస్థాన్ జట్టు:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫకార్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్
టీ20 ప్రపంచ కప్ 2024 కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్..