Asianet News TeluguAsianet News Telugu

టీ20 ప్రపంచ కప్ 2024 కు ముందు బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్..

USA vs BAN : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కు ముందు బంగ్లాదేశ్ కు బిగ్ షాకిచ్చింది అమెరికా క్రికెట్ జ‌ట్టు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సిరీస్ లో యునైటెడ్ స్టేట్స్ రెండవ వరుస విజయంతో బంగ్లాదేశ్ కష్టాలను మరింతగా పెంచుతూ సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. 
 

USA cricket team shocked Bangladesh again before the T20 World Cup 2024 RMA
Author
First Published May 25, 2024, 12:41 PM IST

USA vs BAN : తొలి ట్వంటీ-20 ఓటమి నుంచి తేరుకోక‌ముందే బంగ్లాదేశ్ కు అమెరికా క్రికెట్ జట్టు మళ్లీ షాకిచ్చింది. రెండో మ్యాచ్ లోనూ 6 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అమెరికా క్రికెట్ చరిత్రలో ఇదే గొప్ప విజయమ‌ని చెప్పాలి. క్రికెట్ లోకి ఇప్పుడిప్పుడే అడుగులు పెడుతున్న అమెరికా.. దిగ్గ‌జ జ‌ట్ల‌కు సైతం ఎన్నో షాకులిచ్చిన బంగ్లాను ఓడించింది. టీ-20 ప్రపంచకప్ 2024కు ఈ సిరీస్‌ను 'వార్మ్-అప్' మ్యాచ్‌గా మాత్రమే చూసిన బంగ్లాదేశ్‌కు ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఇక బంగ్లాదేశ్ చివరి మ్యాచ్‌లో విజయం సాధించి జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపి వ‌ర‌ల్డ్ క‌ప్ ప్ర‌యాణం సాగించాల‌ని చూస్తోంది.

ఈ మ్యాచ్‌లో అమెరికా నిర్దేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో బంగ్లాదేశ్ 138 పరుగులకే ఆలౌటైంది. బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుగ‌ అమెరికా బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ మోనాంక్ పటేల్ 38 బంతుల్లో 42 పరుగులు చేశాడు. స్టీవెన్ టేలర్ (28 బంతుల్లో 31), ఆరోన్ జోన్స్ (34 బంతుల్లో 35) బ్యాట్ తో మెరిశారు. దీంతో 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి అమెరికా జ‌ట్టు 144 ప‌రుగులు చేసింది.

IPL 2024: రాజస్థాన్ రాయ‌ల్స్ ఓటమికి ఈ ఐదుగురే కార‌ణం.

145 ప‌రుగుల ఈజీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన బంగ్లాదేశ్ ను అమెరికా బౌల‌ర్లు బాల్ తో  ఉక్కిరిబిక్కిరి చేశారు. అమెరికా బౌల‌ర్ల బెబ్బ‌కు నలుగురు బంగ్లా ఆట‌గాళ్ల‌లో 8 మంది సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 34 బంతుల్లో 36 పరుగుల వద్ద ఔటయ్యాడు. షకీబ్ అల్ హసన్ 23 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండ్‌లోని మిగిలిన బ్యాట్స్‌మెన్లు క్రీజులో ఎక్కువ సేపు నిల‌వ‌లేక‌పోయారు. క్రీజులోకి అలా వ‌చ్చి ఇలా వెళ్లిపోయారు. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 138 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. అమెరికా తరఫున అలీఖాన్ మూడు వికెట్లు తీయగా, సౌరభ్ నేత్రవాల్కర్, షాడ్లీ వాన్ షాక్విక్ తలో రెండు వికెట్లు తీశారు. సిరీస్‌లో చివరి మ్యాచ్‌ శనివారం జరగనుంది.

స్టెప్పులేసిన క్యావ్య మార‌న్.. ఏడ్చేసిన ఫ్యాన్స్.. వైర‌ల్ వీడియోలు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios