'విరాట్ కోహ్లీని పాకిస్తాన్ ప్రజలు చాలా ప్రేమిస్తారు..'
Champions Trophy 2025: పాక్ లోని క్రికెట్ అభిమానులకు భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టమనీ, వచ్చే ఏడాది జరిగే ఐసీసీ టోర్నమెంట్ ఆడేందుకు పాకిస్థాన్‌కు రావాల్సిందిగా మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది టీమిండియాను కోరారు.
Champions Trophy 2025: దాయాది దేశాలైన భారత్-పాకిస్తాన్ లు చాలా కాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్ లను ఆడటం లేదు. ఈ రెండు దేశాలు అవకాశం వచ్చినప్పుడల్లా ఐసీసీ టోర్నమెంట్లలో తలపడతున్నాయి. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ లో జరగనుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న వివిధ పరిస్థితుల కారణంగా బీసీసీఐ టీమిండియాను పాకిస్తాన్ కు పంపే అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే భారత జట్టు తమ దేశంలో పర్యటించాలని కోరారు పాకిస్తాన్ మాజీ స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది. పాకిస్థాన్‌లో పర్యటించి ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆడాలని భారత క్రికెట్ జట్టును ఈ మాజీ ఆల్ రౌండర్ కోరారు. భారత క్రికెటర్లు గతంలో పాకిస్థాన్‌లో ఆతిథ్యాన్ని ఆస్వాదించారనీ, రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు కూడా అందుకు సిద్ధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వచ్చే ఏడాది ఆరంభంలో టీమిండియా పాక్ పర్యటనకు వెళితే విరాట్ కోహ్లి అందరి దృష్టిని ఆకర్షిస్తాడని షాహిద్ అఫ్రిది అన్నాడు. భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అంటే పాక్ క్రికెట్ అభిమానులకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉందని పలు మీడియా నివేదికలు పేర్కొంటున్న తరుణంలో ఆఫ్రిది వ్యాఖ్యలు చేశారు. "నేను భారత జట్టును స్వాగతిస్తున్నాను. పాక్ రావాలని కోరుతున్నారు. నేను పాకిస్తాన్ జట్టుతో కలిసి భారతదేశంలో పర్యటించినప్పుడల్లా నాకు చాలా గౌరవం.. ప్రేమ లభించింది. అలాగే, 2005లో భారతదేశం ఇక్కడకు వచ్చినప్పుడు, వారు చాలా గౌరవం.. ప్రేమను పొందారు. వారు ఇక్కడ తమ మంచి సమయాన్ని, ఆతిథ్యాన్ని ఆస్వాదిస్తారు. ఇదివరకు పర్యటనల్లో ఇది జరిగిందని" అఫ్రిది గుర్తు చేశారు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయేనా..?
"క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి.. పాకిస్థాన్‌కు వచ్చే భారతీయులు, పాకిస్థానీయులు భారత్‌కు వెళ్లడం.. ఇంతకు మించిన అందం ఏమైనా ఉంటుందా" అని అఫ్రిది అన్నారు. ఈ క్రమంలోనే కింగ్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక్కడకు వస్తే విరాట్ కోహ్లీ భారత్ ఆతిథ్యాన్ని కూడా మరచిపోతాడని పేర్కొన్నాడు. తనకు ఇష్టమైన ఆటగాళ్లలో ఒకరైన కోహ్లీని పాకిస్తాన్ క్రికెట్ లవర్స్ చాలా ప్రేమిస్తారని అన్నారు. విరాట్ స్వదేశంలో ఉన్న ప్రశంసల కంటే పాకిస్తాన్ క్రికెట్ అభిమానుల నుండి ఎక్కువ ప్రేమను పొందుతాడని పేర్కొన్నాడు. "విరాట్ కోహ్లీ పాకిస్థాన్‌కు వస్తే.. భారత్‌లోని ప్రేమ, ఆతిథ్యాన్ని మరచిపోతాడు. అతడికి సొంత అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్‌లో చాలా క్రేజ్ ఉంది. పాకిస్థాన్‌లో అతడిని ప్రజలు చాలా ఇష్టపడతారు. అతను నా అభిమాన ఆటగాడు" అని తెలిపాడు.
హార్దిక్ పాండ్యాతో విడాకులు.. కొత్త అమ్మాయితో డేటింగ్ రూమర్లపై నటాషా రియాక్షన్ ఇదే.. !