ఓ బాబర్ ఆజామూ.. నువ్వు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌ను చూసి నేర్చుకో.. !

IND vs PAK T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా జూన్ 9న  భార‌త్ - పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ హైఓల్టేజీ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మల గురించి ప్ర‌స్తావిస్తూ పాక్ కెప్టెన్ బాబార్ ఆజం పై  పాకిస్తాన్ మాజీ ప్లేయ‌ర్ ర‌షీద్ ల‌తీఫ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. 
 

Oh Babar Azam.. you should watch Virat Kohla and Rohit Sharma and learn : IND vs PAK Rashid Latif RMA

IND vs PAK T20 World Cup 2024 : టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024లో జ‌ర‌గ‌బోయే భారత్-పాకిస్తాన్ హై వోల్టేజీ మ్యాచ్ కు ముందు గెలుపు వ్యూహాలు, జట్టు కూర్పులు, ఆటగాళ్ల మ్యాచ్ లు తదితర అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా కాలం త‌ర్వాత చిరకాల ప్రత్యర్థులైన ఇండియా-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ క్ర‌మంలోనే ఆదివారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. పాక్ కెప్టెన్ బాబార్ ఆజంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు.

బాబర్ ఆజం అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. నాయకుడిగా, కెప్టెన్ గా ఎద‌గ‌డానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయ‌ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్ అభిప్రాయపడ్డాడు. అయితే, దీని కోసం భార‌త స్టార్ ప్లేయ‌ర్లను చూసి కొన్ని విష‌యాలు నేర్చుకోవాల్సి ఉంటుంద‌ని సూచించాడు. ముఖ్యంగా ఒత్తిడిని అత్యంత చాకచక్యంగా ఎదుర్కొనే సత్తాకు పేరుగాంచిన భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రదర్శించిన అసాధారణ సంయమనాన్ని గమనించడం, అనుకరించడం ద్వారా బాబర్ ఆజం గొప్ప కెప్టెన్ గా  ఎద‌గ‌డానికి అవ‌కాశాలు ఉంటాయ‌ని పేర్కొన్నాడు.

"జూన్ 9న భారత్ తో జరిగే మ్యాచ్ పైనే అందరి దృష్టి ఉంది. ప్రపంచకప్ లో రాణించడం కంటే భారత్ తో మ్యాచ్ అంటే బాబర్ ఆంజం తీవ్ర ఒత్తిడికి గురవుతాడు. కానీ, ఒత్తిడిని తట్టుకోవడం నేర్చుకోవాలి, విరాట్, రోహిత్ నుంచి అది నేర్చుకోవాలి.  మ్యాచ్ ను ఎలా ముందుకు నడిపించాలో వారికి తెలుసు. బ్యాట్స్ మన్ గా బాబర్ అత్యుత్తమ ఆటగాడని, కానీ కెప్టెన్ గా, నాయకుడిగా అతడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది" అని ర‌షీద్ లతీఫ్ పేర్కొన్నాడు.

ఇది మాములు ర‌చ్చ కాదు.. భారత్‌తో మ్యాచ్ కు ముందే పాకిస్తాన్ ను ఆటాడుకుంటున్న జొమాటో, స్విగ్గీ..

2021, 2022లో ఉన్నంత సన్నద్ధతతో జట్టు కనిపించడం లేద‌ని కూడా పేర్కొన్నాడు. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్థాన్ సాధారణంగా మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ, 2021, 2022 ఎడిషన్లలో వారి ప్రదర్శనతో పోలిస్తే ఆ జట్టు బలహీనంగా, సమిష్టిగా కనిపించిందని, అక్కడ వారు వరుసగా సెమీఫైనల్ కు చేరుకుని రన్నరప్ గా నిలిచారని లతీఫ్ వ్యాఖ్యానించాడు. గత ఏడాది జరిగిన 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ, ఆటగాళ్లు, సెలక్షన్ కమిటీలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోవడంతో జట్టులో అస్థిరత ఏర్పడిందని అన్నారు.

అలాగే, కుల్దీప్ యాదవ్ ప్రస్తుత ఫామ్, ఇటీవ‌ల ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న (11 ఐపీఎల్ 2024 మ్యాచ్లలో 16 వికెట్లు పడగొట్టాడు), అలాగే వేదికల వద్ద ఉన్న పరిస్థితులు, ఇప్పటివరకు పిచ్ల ప్రవర్తనను పరిగణనలోకి తీసుకొని, టోర్నమెంట్ అంతటా కుల్దీప్ యాద‌వ్ ఫిట్ నెస్ పై భారత్ విజయం ఆధారపడి ఉంటుంద‌ని లతీఫ్ పేర్కొన్నాడు. "కుల్దీప్ యాదవ్ ప్రపంచ కప్ అంతటా భారత్ కు ఫిట్ గా ఉంటే బ్యాట్స్ మెన్ కు ఇబ్బంది కలిగించే ఆటగాడు. అతను భారత్ కీలక బౌలర్, విజయానికి కీలకం. ప్రస్తుత ఫామ్, గణాంకాలను బట్టి చూస్తే జూన్ 9 కంటే ముందు కచ్చితంగా భారత్ కు అడ్వాంటేజ్ ఉంది. ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ జట్టు బాగా ఆడుతుంది, కానీ జట్టు 2021, 2022 లో ఉన్నంత సన్నద్ధతతో కనిపించడం లేదు. గత వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ, సెలక్షన్ కమిటీ, ఆటగాళ్లలో మార్పులతో నష్టం జరిగింది' అని లతీఫ్ పేర్కొన్నాడు.

IND VS PAK : భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్క‌డ లైవ్ ఉచితంగా చూడ‌వ‌చ్చు?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios