ఆక్లాండ్: సొంత గడ్డపై టీ20 సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసి ఘోరంగా ఓడించిన కోహ్లీసేనపై న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. మూడు వన్డేల సీరిస్ లో వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి 2-0 తేడాతో టీమిండియాను కివీస్ చిత్తుచేసింది. ఇలా మరోో మ్యాచ్ మిగిలుండగానే సీరిస్ ను కైవసం చేసుకుంది.  టీ20  సీరిస్ లో అదరగొట్టిన టీమిండియాకు వన్డే సీరిస్ లో పరాభవం తప్పలేదు. 

శనివారం ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లోనూ విఫలమయ్యింది. మొదట ఆతిథ్య జట్టు బ్యాటింగ్ కు దిగి 273 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన భారత్ కేవలం 251 పరుగులకే ఆలౌటయ్యింది. మ్యాచ్ చివర్లో జడేజా (55 పరుగులు) పోరాడినా విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. 

భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్  52, జడేజా 55, సైనీ 45, పృథ్వీ షా 24 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. బెనెట్టె 2, సౌథీ 2, జామిసన్ 2, గ్రాండ్ హోమ్ 2, నీషమ్ 1 వికెట్ పడగొట్టి భారత్ ను  ఓటమి అంచుల్లోకి నెట్టారు.

కీలక సమయంలో బ్యాటింగ్ కు దిగిన అతడు హాఫ్ సెంచరీ సాధించి భారత్ విజయంపై ఆశలు రేకెత్తించారు. అయితే చివరి వికెట్  రూపంలో అతడు వెనుదిరగడంతో కోహ్లీసేనకె ఓటమి తప్పలేదు.

భారత ఇన్నింగ్స్ ను విజయంవైపు  నడుస్తున్నసమయంలో సైనీ(45 పరుగులు)  ఔటయ్యాడు. హాఫ్ సెంచరీకి చేరువలో అతడు ఔటయ్యాడు. దీంతో భారత్ 229 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాస్సేపు భారత విజయంపై  రవీంద్ర జడేజా ఆశలు రెకెత్తించినా ఫలితం లేకుండా పోయింది. 

విండీస్ తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ ను ఆదుకునేవారే కనిపించడం లేదు. కాస్సేపు వికెట్ కాపాడుకుంటూ ఆడిన ఠాకూర్ 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అతన్ని గ్రాండ్ హోమ్ ఔట్ చేశాడు. దీంతో 153 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 

న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన 274 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. భారత్ 129 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. నిలకడగా ఆడుతూ వచ్చిన శ్రేయస్ అయ్యర్ 52 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ కు చేరుకున్నాడు.

96 పరుగుల వద్ద భారత్ 96 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. కేదార్ జాదవ్ 27 బంతులు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేసి సౌథీ బౌలింగులో అవుటయ్యాడు.

71 పరుగుల స్కోరు వద్ద భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి గ్రాండ్ హోమ్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.ఇండియా 57 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. అతను 25 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి సౌథీకి వికెట్ సమర్పించుకున్నాడు.

భారత్ 34 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పృథ్వీ షా దూకుడుగా ఆడుతూ 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జమీషన్ బౌలింగులో పెవిలియన్ చేరుకున్నాడు. భారత్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ కేవలం 3 పరుగులు చేసి బెన్నెట్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

న్యూజిలాండ్ ను మరోసారి రాస్ టైలర్ అదుకున్నాడు. అతను నిలకడగా ఆడడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులు చేసింది. రాస్ టైలర్ 74 బంతుల్లో 73 పరుగులు చేసిన నౌటౌట్ గా మిగిలాడు.జమీషన్ 24 బంతుల్లో 25 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు, భారత బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశాడు. మరో వికెట్ జడేజాకు లభించింది.

ఇండియాపై జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 197 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. టీమ్ సౌథీ కేవలం 3 పరుగులు చేసి చాహల్ బౌలింగులో అవుటయ్యాడు.

న్యూజిలాండ్ 187 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. న్యూజిలాండ్ 175 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. నీషం 3 పరుగులు మాత్రమే చేశాడు. అతన్ని రవీంద్ర జడేజా రన్నవుట్ చేశాడు. దూకుడుగా ఆడుతూ వచ్చిన గుప్తిల్ 79 బంతుల్లో 79 పరుగులు చేసి రన్నవుట్ అయ్యాడు. న్యూజిలాండ్ 93 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. నికోలస్ చాహల్ బౌలింగులో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

 రెండో వన్డేకు భారత్ రెండు మార్పులు చేసింది. మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో నవదీప్ సైనీ, యుజువేంద్ర చాహల్ తుది జట్టులోకి వచ్చారు. న్యూజిలాండ్ కూడా రెండు మార్పులు చేసింది. కైల్ జమీసన్ వన్డేల్లోకి ఆరంగేట్రం చేస్తుండగా, మార్క్ చాంప్ మ్యాన్ సాంత్నర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు. 

తుది జట్లు

న్యూజిలాండ్: మార్టిన్ గుప్తిల్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, రాస్ టైలర్ టామ్ లాథమ్, మార్క్ చాంప్ మ్యాన్, జేమ్స్ నీషం, కోలిన్ డీ గ్రాండ్ హోమ్, టీమ్ సౌథీ, కైల్ జామీసన్, హమీష్ బెన్నెట్

ఇండియా: పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, నవదీప్ షైనీ, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా