Yashasvi Jaiswal: ఫార్మట్ ఏదైనా దంచికొట్టుడే.. టీమిండియాకు మరో సెహ్వాగ్.. !
India vs England: ఫార్మట్ ఏదైనా ధనాధన్ ఇన్నింగ్స్ తో టీమిండియాలో మరో వీరేంద్ర సెహ్వాగ్ ల ముందుకు సాగుతున్నాడు యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్. అరంగేట్రంలోనే సూపర్ ఇన్నింగ్స్ సెంచరీ కొట్టిన జైస్వాల్ ప్రస్తుతం టీమిండియాలో మూడు ఫార్మట్ లలో సంబంధం లేకుండా దంచికొడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు.
Virender Sehwag Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ భారత క్రికెట్ లో ఒక సంచలనం. ఫార్మట్ ఏదైనా ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొడుతూ తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించాడు. జట్టుకు కొత్త ఆటగాడు అయినా.. అతను ఆడిన ఇన్నింగ్స్ గొప్పవి. అందించిన విజయాలు పెద్దవి. ఇటీవల అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ ఇప్పటికే పలు రికార్డులు సృష్టించడం ప్రారంభించాడు. ప్రస్తుతం టీమ్ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో ఆడుతున్నాడు. అంటే టెస్టు, వన్డే, టీ20ల్లో అద్భుతంగా బ్యాటింగ్ దిగ్గజ క్రికెటర్లను గుర్తిచేస్తున్నాడు. వారికి అప్ డేట్ వెర్షన్ గా పేరు సంపాదిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లను అధిగమించాడు. భారత జట్టుకు మరో వీరేంద్ర సెహ్వాగ్ లా యశస్వి జైస్వాల్ ప్రశంసలు అందుకుంటున్నాడు.
సెహ్వాగ్ భారత డాషింగ్ ఓపెనర్.. ధనాధన్ ఇన్నింగ్స్ పెట్టింది పేరు. టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మట్ లతో సంబంధం లేకుండా బ్యాటింగ్ కు దిగిన వెంటనే బౌలర్లపై విరుచుకుపడే వాడు. ఉన్నంత సేపు గ్రౌండ్ లో పరుగుల వరద పారించేవాడు. ఇప్పుడు సెహ్వాగ్ తరహాలోనే యశస్వి జైస్వాల్ కూడా ఫార్మట్ తో సంబంధం లేకుండా ధనాధన్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇదే సమయంలో వికెట్ పడకుండా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 80 పరుగులతో రాణించాడు. జట్టు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు.
చెత్త షాట్.. పదేపదే అదే తప్పు.. శుభ్‌మన్ గిల్ పై సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్స్.. !
షాట్ సెలెక్షన్ లో జైస్వాల్ నిక్కచ్చిగా ఉంటాడు. క్రీజ్ లో అతని కదలికలు కూడా అద్భుతంగా ఉంటాయి. అతని ఫుట్ వర్క్ ఖచ్చితమైనదనీ, ఆడే షాట్ కొన్ని సార్లు అసాధారణమైనవిగా ఉంటాయి. బౌలర్లపై విరుచుకుపడుతున్న తీరు కూడా ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి జారుస్తుంది. గత ఏడాది వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో 387 బంతుల్లో 171 పరుగులు చేసి 501 నిమిషాల పాటు ఆడిన తన అరంగేట్ర టెస్టు సెంచరీ ఎప్పటికీ గుర్తండుపోయే ఇన్నింగ్స్. ఈ క్లాసిక్ టెస్ట్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ శ్రద్ధ.. సహనంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో ఆ తర్వాత అతను ఆడిన ధనాధన్ ఇన్నింగ్స్ దిగ్గజ ప్లేయర్ సెహ్వాగ్ ను గుర్తు చేస్తున్నాయి. ఇదే ఆటతీరును కొనసాగిస్తే డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు అప్డేట్ వెర్షన్.. భవిష్యత్ సూపర్ స్టార్ గా యశస్వి జైస్వాల్ మారడం ఖాయం.. !
గాల్లో పల్టీలు కొట్టిన విండీస్ బౌలర్ కెవిన్ సింక్లైర్.. వైరల్ వీడియో !
- 2024 England tour of India
- BCCI
- Ben Stokes
- Cricket
- England National Cricket Team
- England vs India
- ICC
- IND v ENG
- IND v ENG Test
- India
- India vs England 1st Test
- India vs England Live Score Updates
- Indian National Cricket Team
- Jaisball
- Jasprit Bumrah
- Joe Root
- KL Rahul
- Ravichandran Ashwin
- Ravindra Jadeja
- Rohit Sharma
- Rohit Sharma fan
- Virender Sehwag
- Virender Sehwag Yashasvi Jaiswal
- Yashasvi Jaiswal
- england
- games
- india vs england test series
- sports