Asianet News TeluguAsianet News Telugu

చెత్త షాట్.. ప‌దేప‌దే అదే త‌ప్పు.. శుభ్‌మన్ గిల్ పై సునీల్ గ‌వాస్క‌ర్ హాట్ కామెంట్స్.. !

IND v ENG: శుభ్‌మాన్ గిల్ గిల్ వ‌రుస వైఫ‌ల్యాల‌తో నిరాశ‌ప‌రుస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ఆడిన 38 ఇన్నింగ్స్‌ల్లో గిల్‌ 10 సార్లు 25 పరుగుల మార్కును దాటినా హాఫ్‌ సెంచరీని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే, టెస్టు క్రికెట్ లో ప‌దేప‌దే అదే త‌ప్పుతో విఫ‌ల‌మ‌వుతున్నాడంటూ శుభ్‌మాన్ గిల్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
 

The worst shot.. It's the same mistake again, Sunil Gavaskar's hot comments on Shubman Gill RMA
Author
First Published Jan 27, 2024, 10:42 AM IST

Shubman Gill - Sunil Gavaskar: భార‌త యంగ్ ప్లేయ‌ర్ శుభ్ మ‌న్ గిల్ వ‌న్డేలు, టీ20ల్లో అద‌ర‌గొడుతున్న టెస్టుల్లో మాత్రం వ‌రుస‌గా విఫ‌లమ‌వుతూనే ఉన్నాడు. టెస్టుల్లో అత‌ని బ్యాట్ నుంచి భారీ స్కోర్లు రావ‌డం లేదు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టెస్టు సిరీస్ లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయిన గిల్.. హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కూడా పెద్ద‌గా ప‌రుగులు చేయ‌కుండానే పెవిలియ‌న్ కు చేరాడు. టెస్టుల్లో వ‌రుస గా విఫ‌లం కావ‌డంపై భార‌త దిగ్గ‌జ ప్లేయ‌ర్, ప్ర‌ముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ హాట్ కామెంట్స్ చేశారు.

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ తొలి రోజు శుభ్ మ‌న్ గిల్ త‌న వికెట్ ను కాపాడుకోవ‌డానికి తీవ్రంగానే శ్రమించాడు. ఇదే స‌మ‌యంలో ఒకవైపు యశస్వి జైస్వాల్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ చేస్తుండగా, గిల్ వికెట్లను కాపాడుకునే ప్రయత్నంలో డిఫెన్సివ్ షాట్లు ఆడుతున్నాడు. రెండో రోజు భారీ స్కోరు చేయడంపై అతని కన్ను పడింది. అయితే,  తొలి రోజు తన వికెట్ ను కాపాడుకోగలిగాడు కానీ రెండో రోజు తన వికెట్ కోల్పోవ‌డంతో అత‌ని ప్ర‌య‌త్నం మ‌ళ్లీ వృధాగానే పోయింది. కామెంటరీ బాక్స్ లో కూర్చున్న‌ సునీల్ గవాస్కర్ మ‌రోసారి శుభ్ మ‌న్ గిల్ ఆట తీరుపై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుపడ్డాడు.

సౌర‌వ్ గంగూలీని బీట్ చేసిన రోహిత్ శ‌ర్మ.. !

కామెంటరీ సందర్భంగా గవాస్కర్ మాట్లాడుతూ అదేం షాట్.. చెత్త షాట్ ఆడి ఔట్ అయ్యాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. 'అతడు ఎలాంటి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు? అతను గాల్లో షాట్ ప్లే చూస్తున్నప్పుడు ఇది అర్థం అవుతుంది, కానీ ఇది చెడ్డ ఆన్ డ్రైవ్ మాత్రమే. ఎంతో కష్టపడి ఆ తర్వాత అలాంటి షాట్ ఆడాడు. ప‌దే ప‌దే ఇలాంటి షాట్ల‌తోనే పెవిలియ‌న్ కు చేరుతున్నాడ‌ని' అన్నాడు. 35వ ఓవర్లో 5వ బంతికి శుభ్ మ‌న్ గిల్ ఔట్ అయ్యాడు. టామ్ హార్ట్లీ  వేసిన బంతిని ఆన్ డ్రైవ్ చేసే ప్రయత్నంలో గిల్ క్యాచ్ రూపంలో బెన్ కు దొరికిపోయాడు. 66 బంతులు ఎదుర్కొని కేవలం 2 ఫోర్లు మాత్రమే బాదిన గిల్ ఇన్నింగ్స్ 23 పరుగుల వద్ద ముగిసింది. గిల్ తన ఇప్ప‌టివ‌ర‌కు సాగిన త‌న టెస్టు కెరీర్ లో చాలాసార్లు ఇలాంటి షాట్లు ఆడే ఔట్ అయ్యాడు. దీంతో అత‌నిపై గ‌వాస్క‌ర్ తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించాడు. ప‌దే ప‌దే ఇలాంటి షాట్లు ఎందుకు ఆడి ఔట్ కావ‌డం అని ప్ర‌శ్నించాడు.

గాబ్బా లో 91 పరుగుల ఇన్నింగ్స్ తో సహా రెడ్ బాల్ క్రికెట్ లో ఇప్పటివరకు నాలుగు సార్లు 50 పరుగుల మార్కును దాటాడు. కానీ అతను ఒక్కసారి కూడా మూడంకెల మార్కును చేరుకోలేకపోయాడు. ఇప్పటి వరకు ఆడిన 38 ఇన్నింగ్స్ ల‌లో గిల్ 10 సార్లు 25 పరుగుల మార్కును దాటినా హాఫ్ సెంచరీని అందుకోలేకపోయాడు. మంచి టాలెంట్ ఉంది, కానీ రెడ్ బాల్ క్రికెట్లో ఇలాంటి షాట్ల‌తో వికెట్ల ముందు దొరికిపోవ‌డం అతని భవిష్యత్తు గురించి ఆందోళన కలిగించే విషయం. ఇక మ్యాచ్ విషయానికొస్తే ప్రస్తుతం భార‌త్ తొలి ఇన్నింగ్స్ ను 436 ప‌రుగులు చేసింది. జైస్వాల్ 80 ప‌రుగులు, కేఎల్ రాహుల్ 86 ప‌రుగులు, ర‌వీంద్ర జ‌డేజా 87, శ్రీఖ‌ర్ భ‌ర‌త్ 41 ప‌రుగులు, అక్ష‌ర్ ప‌టేల్ 44 ప‌రుగులు చేశారు. భార‌త్ కు తొలి ఇన్నింగ్స్ లో 190 ప‌రుగులు అధిక్యం ల‌భించింది.

గాల్లో ప‌ల్టీలు కొట్టిన‌ విండీస్ బౌల‌ర్ కెవిన్ సింక్లైర్.. వైర‌ల్ వీడియో !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios