కేన్ మామ సెంచ‌రీల మోత‌.. ఇలాగైతే, స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డులు బ‌ద్ద‌లే !

New Zealand vs South Africa: ఇప్ప‌టికే విరాట్ కోహ్లీ టెస్టు సెంచ‌రీల రికార్డును బ్రేక్ చేసిన న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ వ‌రుస సెంచ‌రీల మోత మోగిస్తున్నాడు. దిగ్గ‌జ క్రికెటర్ల రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొడుతున్నాడు. గ‌త 10 ఇన్నింగ్స్ ల‌లో విలియ‌మ్స‌న్ 6 సెంచ‌రీలు కొట్టాడు. 
 

New Zealand vs South Africa: Kane Williamson hits centuries in two innings; Will he break Sachin Tendulkar's record? RMA

Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ సెంచ‌రీల మోత మోగిస్తున్నాడు. వ‌రుస సెంచ‌రీల‌తో దిగ్గ‌జ ప్లేయ‌ర్ల రికార్డులను బ‌ద్ద‌లు కొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలి ఇన్నింగ్స్ తో పాటు రెండో ఇన్నింగ్స్ లో కూడా సెంచ‌రీ బాదాడు. దక్షిణాఫ్రికాతో మౌంట్ మౌంగనూయ్ వేదిక‌గా జరుగుతున్న తొలి టెస్టులో కీవీస్ ప్లేయ‌ర్ కేన్ విలియమ్సన్ 3వ రోజు రెండో సెంచరీ సాధించాడు.

విలియమ్సన్ మొదటి ఇన్నింగ్స్‌లో తన 118 ప‌రుగులు చేయ‌గా, రెండో ఇన్నింగ్స్ లో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తూ సెంచ‌రీ (109 పరుగులు) కొట్టాడు. రెండు ఇన్నింగ్స్ ల‌లో సెంచ‌రీలు బాదిన 5వ న్యూజిలాండ్ ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసే స‌మాయానికి నాలుగు వికెట్లు కోల్పోయిన కీవీస్ జ‌ట్టు మొత్తం ఆధిక్యాన్ని 528 పరుగులకు తీసుకెళ్లింది. దీంతో దక్షిణాఫ్రికా క‌ష్టాలు మ‌రింత‌గా పెరిగాయి. రెండు ఇన్నింగ్స్ ల‌లో సెంచ‌రీలు కొట్టిన కీవీస్ ప్లేయ‌ర్ల‌లో కేన్ విలియమ్సన్ కంటే ముందు, గ్లెన్ టర్నర్ (1974), జియోఫ్ హోవర్త్ (1978), ఆండ్రూ జోన్స్ (1991), పీటర్ ఫుల్టన్ (2013)లు ఉన్నారు.

WI vs AUS: ఇదేం వ‌న్డే గురూ.. 6.5 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ ముగించారు.. !

ప్ర‌స్తుతం కేన్ విలియ‌మ్స‌న్ దూకుడు చూస్తుంటూ మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును సైతం బ‌ద్ద‌లు కొట్టేలా క‌నిపిస్తున్నాడు. కివీస్ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ కు ఇది 31వ టెస్టు సెంచరీ కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో 44వ సెంచరీ. వ‌న్డేల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 13 సెంచ‌రీలు బాదాడు. ప్ర‌స్తుతం క్రికెట్ లో కొన‌సాగుతున్న వారిలో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్‌తో కలిసి టెస్టుల్లో అత్యంత వేగంగా 31 సెంచరీలు సాధించిన రెండో ప్లేయ‌ర్ గా నిలిచాడు. ఈ లిస్టులో భారత క్రికెట్ దిగ్గ‌జం సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు.

ప్ర‌స్తుతం క్రికెట్ లో కొన‌సాగుతున్న ఆటగాళ్లలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీల పరంగా విలియమ్సన్ ఇప్పుడు స్మిత్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ (80) అత్యధిక అంతర్జాతీయ సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ రెండో (46), భారత ఆటగాడు రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44), విలియమ్సన్ (44) సెంచ‌రీలు కొట్టారు. ఇక టెస్టుల్లో ప్ర‌స్తుతం కొన‌సాగుతూ అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప్లేయ‌ర్ల‌లో స్టీవ్ స్మిత్ - 32 సెంచరీలు (107 మ్యాచ్‌లు) టాప్ లో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానంలో కేన్ విలియమ్సన్ - 31 సెంచరీలు (97 మ్యాచ్‌లు), జో రూట్ - 30 సెంచరీలు (137 మ్యాచ్‌లు), విరాట్ కోహ్లీ - 29 సెంచరీలు (113 మ్యాచ్‌లు) ఉన్నారు.

Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొల‌గించింది అందుకే..

 

అత‌ను ఛాంపియన్ ప్లేయర్.. ఇంగ్లాండ్ సిరీస్ పై రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైరల్ ! 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios