Asianet News TeluguAsianet News Telugu

WI vs AUS: ఇదేం వ‌న్డే గురూ.. 6.5 ఓవ‌ర్ల‌లోనే మ్యాచ్ ముగించారు.. !

Australia vs West Indies: ఆస్ట్రేలియా వెస్టిండీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది.  50 ఓవ‌ర్ల వ‌న్డే మ్యాచ్ ను 6.5 ఓవ‌ర్ల‌లోనే ముగించింది. మూడు వ‌న్డేల సిరీస్ లో విండీస్ ను కంగారుల టీమ్ వైట్ వాష్ చేసింది. 
 

Australia bowl out West Indies for 86, The match ended in 6.5 overs; complete 3-0 series sweep WI vs AUS RMA
Author
First Published Feb 6, 2024, 1:19 PM IST | Last Updated Feb 6, 2024, 1:19 PM IST

Australia vs West Indies: టీ20 క్రికెట్ ఎంట్రీ త‌ర్వాత క్రికెట్ లో సంచ‌ల‌నాలు న‌మోద‌వుతూనే ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ ఆడే తీరును టీ20 క్రికెట్, ఇత‌ర లీగ్ లు పూర్తిగా మార్చి ప‌డేశాయి. ఇదే క్ర‌మంలో వ‌న్డే క్రికెట్ కూడా టీ20 త‌ర‌హాలో మారుతోంది. తాజాగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ వ‌న్డే మ్యాచ్ కేవ‌లం 6.5 ఓవ‌ర్ల‌లోనే ముగించ‌డం దీనికి నిద‌ర్శ‌నం. వివ‌రాల్లోకెళ్తే.. ఆస్ట్రేలియా జ‌ట్టు వెస్టిండీస్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. 50 ఓవ‌ర్ల మ్యాచ్ ను కేవ‌లం 6.5 ఓవ‌ర్ల‌లో ఫినిష్ చేసింది.

మంగ‌ళ‌వారం మనుకా ఓవల్, కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మ‌ధ్య మూడో వ‌న్డే మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్ లో కంగారుల జ‌ట్టు విండీస్ ను చిత్తుగా ఓడించింది. 8 వికెట్ల తేడాతో సునాయాస విజ‌యం సాధించింది. దీంతో ఆతిథ్య జట్టు వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌గా ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 24.1 ఓవ‌ర్ల‌లో 86 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా  బౌల‌ర్ జేవియర్ బార్ట్‌లెట్ బాల్‌తో విజృంభి 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, లాన్స్ మోరిస్, ఆడమ్ జంపాలు చెరో రెండు వికెట్లతో చెలరేగడంతో వెస్టిండీస్ 24.1 ఓవర్లలో 86 పరుగులకే ఆలౌటైంది. జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, జోష్ ఇంగ్లిస్ బ్యాటింగ్‌తో రాణించడంతో ఆస్ట్రేలియా 6.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

ROHIT SHARMA: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొల‌గించింది అందుకే..

అలిక్ అథనాజ్ వెస్టిండీస్ తరఫున 60 బంతుల్లో 32 పరుగులు చేసి అత్యధిక స్కోరు నిలిచాడు. ఆస్ట్రేలియా మరో ఎండ్‌లో దూరంగా పెగ్గింగ్ చేస్తూనే ఉన్నప్పటికీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి ప్రయత్నించాడు. 13వ ఓవర్‌లో వెస్టిండీస్ 44/4తో కుప్పకూన త‌ర్వాత వ‌రుస‌గా ప్లేయ‌ర్లు పెవిలియ‌న్ కు క్యూ క‌ట్టారు. 67 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌లో ఫోర్లు, సిక్సర్ల విరుచుకుప‌డుతూ ఫ్రేజర్-మెక్‌గర్క్-ఇంగ్లిస్ ఆస్ట్రేలియాకు విజ‌యం అందించారు. అల్జారీ జోసెఫ్ 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో పాటు సిరీస్ మొత్తంగా అద్భుత ఆట‌తో క‌న‌బ‌ర్చిన జేవియర్ బార్ట్‌లెట్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ ను గెలుచుకున్నాడు. 

అత‌ను ఛాంపియన్ ప్లేయర్.. ఇంగ్లాండ్ సిరీస్ పై రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైరల్ !

సంక్షిప్త స్కోర్లు:

వెస్టిండీస్ స్కోరు - 24.1 ఓవర్లలో 86/10

వెస్టిండీస్ బ్యాటింగ్ ప్రదర్శన
అలిక్ అథానాజ్ 32(60)
రోస్టన్ చేజ్ 12(26)

ఆస్ట్రేలియా బౌలింగ్ ప్రదర్శన
జేవియర్ బార్ట్‌లెట్ 7.1-21-4
ఆడమ్ జంపా 5-14- 2

ఆస్ట్రేలియా స్కోరు - 6.5 ఓవర్లలో 87/2

ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రదర్శన
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 41(18)
జోష్ ఇంగ్లిస్ 35(16)

వెస్టిండీస్ బౌలింగ్ ప్రదర్శన
ఒషానే థామస్ 0.5-7-1
అల్జారీ జోసెఫ్ 3-30-1

IND VS ENG: భార‌త్ గెలుపులో అత‌నే రియ‌ల్ హీరో.. బుమ్రా-జైస్వాల్ 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' ర‌గ‌డ !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios