అత‌ను ఛాంపియన్ ప్లేయర్.. ఇంగ్లాండ్ సిరీస్ పై రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైరల్ !

India vs England: వైజాగ్ వేదిక‌గా భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇలాంటి బలమైన జట్టుపై యువ ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన చేయడం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. 
 

Jasprit Bumrah is our champion player. Test series against England will not be easy, says Rohit Sharma  RMA

India vs England - Rohit Sharma : భార‌త్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా అద్భుత‌మైన ఆట‌తీరుతో విజ‌యం సాధించింది. 106 ప‌రుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భార‌త్ ఈ గెలుపుతో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో 1-1తో స‌మం చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టుపై యంగ్ ప్లేయ‌ర్ల అద్భుత ప్రదర్శన మ‌రింత‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అన్నాడు. 399 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 292 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన భార‌త యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్, మ్యాచ్ లో 9 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాల‌పై రోహిత్ శర్మ ప్ర‌శంస‌లు కురిపించాడు.

బుమ్రా మాకు ఛాంపియ‌న్ ప్లేయ‌ర్.. ! 

ఇంగ్లాండ్ పై రెండో టెస్టు గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన జ‌స్ప్రీత్ బుమ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. బుమ్రా గురించి రోహిత్ శ‌ర్మ మాట్లాడుతూ.. ''అతడు మాకు ఛాంపియన్ ప్లేయర్. గత కొంత కాలంగా టీమిండియా కోసం గొప్ప ఆట‌ను ఆడుతున్నాడు. ఇలాంటి మ్యాచ్ గెలిచినప్పుడు ఓవరాల్ పెర్ఫామెన్స్ ను పరిశీలించాలి. ఈ పరిస్థితుల్లో టెస్టు మ్యాచ్ గెలవడం అంత సులువు కాదు. కానీ, బౌలర్లు తమ పనిని చ‌క్క‌గా చేసుకుంటూ ముదుకు వెళ్లార‌ని'' రోహిత్ శ‌ర్మ పేర్కొన్నాడు.

ఎలా ఆడేది గురూ నువ్వు ఇలా బాల్ వేస్తే.. బుమ్రా బౌలింగ్ తో బెన్ స్టోక్స్ కు దిమ్మదిరిగిపోయింది.. వీడియో !

విశాఖ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుతూ.. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది కానీ, చాలా మంది బ్యాట్స్ మెన్ మంచి ఆరంభాన్ని పెద్ద ఇన్నింగ్స్ గా మార్చలేకపోయారని రోహిత్ శ‌ర్మ అన్నాడు.  'పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా గైర్హాజరీలో ఇప్పుడు భారత జట్టులో యంగ్ ప్లేయ‌ర్లు 8 మంది ఉన్నారు. వారి మొత్తం టెస్టుల్లో 68 మ్యాచ్ ల‌ అనుభవం ఉందని తెలిపాడు. 

అంత సులువుగా ఆడే సిరీస్ కాదు.. 

ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారనీ, ఈ ఫార్మాట్ కు కొత్తవారని పేర్కొన్న రోహిత్ శ‌ర్మ‌.. యంగ్ ప్లేయ‌ర్లు సర్దుబాటు కావడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. ''ఈ విజయం మాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇలాంటి యువ జట్టుతో పోటీపడటం చాలా గర్వంగా ఉంది. ఇంగ్లాండ్ బాగా ఆడుతోంది. ఇది అంత సులువైన సిరీస్ కాదని'' రోహిత్ శర్మ అన్నాడు. 'ఇది మంచి ఛాలెంజ్, ఇంగ్లాండ్ అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది. ఇది అంత సులువైన సిరీస్ కాదు. ఇంకా మూడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, మేము చాలా విషయాలను మెరుగుప‌ర్చుకోవాల్సి అవ‌స‌రం ఉంద‌ని' రోహిత్ శ‌ర్మ అన్నాడు.

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భార‌త్ జోరు !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios