Asianet News TeluguAsianet News Telugu

NZ vs PAK: 3వ టీ20లోనూ పాక్ చిత్తు.. ఫిన్ అలెన్ విధ్వంసంతో న్యూజిలాండ్ గెలుపు

New Zealand vs Pakistan: ఓపెనర్ ఫిన్ అలెన్ 62 బంతుల్లో 137 పరుగులతో విధ్వంసం సృష్టించ‌డంతో న్యూజిలాండ్ మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే పాకిస్తాన్ పై టీ20 సిరీస్ విజయం సాధించింది. 225 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పాక్ ను 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్ర‌మే చేసింది. 
 

New Zealand vs Pakistan, 3rd T20I Live Cricket Score, New Zealand won with a brilliant innings by Finn Allen RMA
Author
First Published Jan 17, 2024, 10:55 AM IST

New Zealand vs Pakistan: డునెడిన్‌లోని యూనివర్శిటీ ఓవల్‌ వేదికగా జ‌రిగిన మూడో టీ20లోనూ న్యూజిలాండ్ పాకిస్తాన్ ను చిత్తు చేసింది. కీవీస్ ఓపెనింగ్ బ్యాట‌ర్  ఫిన్ అలెన్ వ‌రుస సిక్స‌ర్ల‌తో పాక్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ఏకంగా 16 సిక్సర్లు, 5 ఫోర్లు తో రికార్డు సెంచ‌రీతో న్యూజిలాండ్ కు విజ‌యం అందించాడు. పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 45 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఫిన్ అలెన్, సీఫెర్ట్ రాణించ‌డంతో న్యూజిలాండ్ జ‌ట్టు 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి 224 ప‌రుగులు చేసింది.

మూడో టీ20లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవ‌ర్ల‌లో 224/7 ప‌రుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ తో పాక్ బౌలింగ్ ఉతికిపారేశాడు. కేవ‌లం 62 బంతుల్లో 137 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వ‌రుస సిక్స‌ర్లు కొట్టి స‌రికొత్త రికార్డు సృష్టించాడు. త‌న ఇన్నింగ్స్ లో ఏకంగా 16 సిక్సర్లు, 5 బౌండరీలు బాదాడు. ఫిన్ అలెన్ 48 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. 3వ టీ20లో 137 పరుగులు చేసిన ఫిన్ అలెన్ ప‌లు రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాడు. ఫిన్ అలెన్ 137, స్టీఫెర్ట్ 31, గ్లెన్ ఫిలిప్స్ 19 త‌ప్ప మిగ‌తా న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు.

Yuvraj Singh: టీమిండియా మెంటార్‌గా యువరాజ్ సింగ్.. !

అయితే, షాహీన్ అఫ్రిది నుండి మొహమ్మద్ వసీం జూనియర్ వరకు పాక్ ప్లేయ‌ర్ల బౌలింగ్ ను ఫిన్ అలెన్ ఉతికిపారేశాడు. ఈ మ్యాచ్‌లో హారిస్ రవూఫ్ పాకిస్థాన్ త‌ర‌ఫున అత్య‌త చెత్త బౌల‌ర్ గా నిలిచాడు. అత‌ను 4 ఓవ‌ర్లు బౌల్ చేసి ఏకంగా 60 పరుగులు ఇచ్చాడు. అయితే, 2 వికెట్లు తీసుకోవ‌డం అత‌నికి ఊర‌ట క‌లిగించే అంశం. అఫ్రిది 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకోగా, మహ్మద్ నవాజ్ 44 పరుగులిచ్చి 4 ఓవర్లలో 1 వికెట్ తీశాడు. అలాగే, జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్ వరుసగా 37, 35 పరుగులిచ్చి ఒక్కొక్క వికెట్ తీశారు.

245 ప‌రుగులు భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 20 ఓవ‌ర్ల‌లో 179 ప‌రుగులు చేసింది. బాబార్ ఆజం 58 ప‌రుగుల‌తో రాణించాడు కానీ, జ‌ట్టుకు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయాడు. మహ్మద్ నవాజ్ 28, మహ్మద్ రిజ్వాన్ 24, ఫఖర్ జమాన్ 19 ప‌రుగులు చేశాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో టిమ్ సౌతీ 2 వికెట్లు తీసుకోగా, మిగ‌తా బౌల‌ర్లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన ఫిన్ అలెన్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

16 సిక్సర్లు, 5 ఫోర్లు.. రికార్డు సెంచ‌రీతో పాక్ బౌల‌ర్ల‌ను ఉతికిపారేసిన ఫిన్ అలెన్..

న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్థాన్ హైలైట్స్

న్యూజిలాండ్ స్కోరు - 20.0 ఓవర్లలో 224/7

న్యూజిలాండ్ బ్యాటింగ్: 
ఫిన్ అలెన్ 137(62)
టిమ్ సీఫెర్ట్ 31(23)

పాక్ బౌలింగ్: 
హారిస్ రవూఫ్ 4-60-2
మహ్మద్ వసీం 4-35-1

పాక్ స్కోరు - 20.0 ఓవర్లలో 179/7

పాక్ బ్యాటింగ్: 

బాబర్ అజామ్ 58(37)
మహ్మద్ నవాజ్ 28(15)

న్యూజిలాండ్ బౌలింగ్: 

టిమ్ సౌథీ 4-29-2
మిచెల్ సాంట్నర్ 4-26-1 
రోహిత్ శ‌ర్మ నుంచి హార్దిక్ పాండ్యాకు ముంబై కెప్టెన్సీ మార్చ‌డానికి ఇదే కార‌ణం..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios