Asianet News TeluguAsianet News Telugu

Yuvraj Singh: టీమిండియా మెంటార్‌గా యువరాజ్ సింగ్.. !

Yuvraj Singh: 2007, 2011 ఐసీసీ వరల్డ్ కప్ లలో టీమిండియా ట్రోఫీలు గెలవడంలో భార‌త స్టార్ ప్లేయ‌ర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. మ‌రోసారి భార‌త టీమ్ కు సేవ‌లు అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.
 

I am confident of doing well as a mentor:Yuvraj Singh, Why fight with Ashish Nehra RMA
Author
First Published Jan 15, 2024, 10:18 AM IST

Indian national cricket team: దిగ్గజ ప్లేయర్, భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ భారత జట్టులోకి వస్తున్నాడు. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్లేయర్ గా కాదు కానీ, జట్టు ఐసీసీ ట్రోఫీలు గెలవడం కోసం తనవంతు సాయం అందించడానికి సిద్ధమవుతున్నాడు. ఐసీసీ టోర్నమెంట్లలో భారత జట్టుకు కోచ్ లేదా మెంటార్ గా ఉండాలనుకుంటున్నానని యువరాజ్ సింగ్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. క్రికెట్ ప్రపంచానికి తన వంతు సేవలందించేందుకు ముందుకు స్టార్ ఆల్ రౌండర్.. మెంటర్ గా ఉండేందుకు సిద్ధమనీ, సాంకేతిక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

2007, 2011 ఐసీసీ వరల్డ్ కప్ లలో భారత జట్టు ట్రోఫీలు గెలవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 2011 ప్రపంచకప్ లో ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. ప్రస్తుతం మెగా టోర్నీలలో ప్లేయర్లు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తంచేశాడు. ఇటీవలి కాలంలో చాలా మంది భారత ఆటగాళ్లు ఐసీసీ టోర్నమెంట్లలో ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్న యువరాజ్ సింగ్.. తమ కళ్లముందే ఎదుర్కొంటున్న ఒత్తిడి పరిస్థితులను చూస్తున్నామని చెప్పాడు. మెర్లెన్ రేస్ లో 'యువరాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 'ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. మెంటార్ గా సేవలు అందించాలనుకుంటున్నానని చెప్పినట్టు పీటీఐ నివేదించింది.

India vs Afghanistan: మ‌ళ్లీ నిరాశపరిచిన రోహిత్ శ‌ర్మ‌.. ఇలా అయితే కష్టమే.. !

'గత కొన్నేళ్లుగా నాకు ఇష్టమైన పని మెంటార్ పాత్ర పోషించడం. నేను క్రికెట్ కు ఏ విధంగానైనా సహకారం అందించాలనుకుంటున్నాను. యంగ్ ప్లేయర్లు మరింత రాణించడంలో భాగం కావాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్ లలో మన యంగ్ ప్లేయర్లు ఒత్తిడికి గుర‌వుతున్నార‌ని అనుకుంటున్నాను. రాబోయే రోజుల్లో టీమిండియా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేసి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆశిస్తున్నా' అని  యువ‌రాజ్ సింగ్ పేర్కొన్నాడు. అలాగే, త‌న క్రికెట్ కెరీర్ లో మిడిలార్డర్ ఆటగాడిగా జట్టుకు ఎంతో సహకారం అందించాన‌ని చెప్పిన యూవీ.. యంగ్ ప్లేయ‌ర్ల‌తో కలిసి పనిచేస్తాననే నమ్మకం ఉంద‌ని తెలిపాడు. యంగ్ ప్లేయ‌ర్ల‌ను సాంకేతికంగా బలోపేతం చేయడమే కాకుండా క్రికెట్ మానసిక ఒత్తిడిని తట్టుకునేలా తీర్చిదిద్దుతాన‌ని చెప్పాడు.

రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశం వస్తుందో  కానీ, కానీ ప్రస్తుతానికి త‌న తొలి ప్రాధాన్యత త‌న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడమేన‌ని యువ‌రాజ్ సింత్ తెలిపాడు. పాఠశాలలో చేరిన తర్వాత త‌న‌కు చాలా స‌మ‌యం దొరుకుతుంద‌నీ, అప్పుడు కోచ్ పదవిని స్వీకరిస్తాన‌ని చెప్పాడు. యువ ఆటగాళ్లతో, ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన యువ ఆటగాళ్లతో కలిసి పనిచేయాలనుకుంటున్నాని పేర్కొన్నాడు. అలాగే, ఐపీఎల్ లో త‌న‌కు ఏ ఫ్రాంచైజీ నుంచి అవ‌కాశం ల‌భిస్తుందోన‌ని ఎదురుచూస్తున్నాన‌ని చెప్పొకొచ్చాడు. కాగా, యూవీ మూడు ఫార్మాట్లలో కలిపి 17 సెంచరీలు, 80 హాఫ్ సెంచరీలతో కలిపి 11,778 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగంలో యువరాజ్ 148 వికెట్లు పడగొట్టాడు.

IND vs AFG: టీ20ల్లో ఒకే ఒక్క‌డు.. 150వ మ్యాచ్ తో రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు


 

Follow Us:
Download App:
  • android
  • ios