ఆక్లాండ్: ఇండియాపై జరిగిన రెండో వన్డే మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లకు జరిమానా పడింది. న్యూజిలాండ్ ఆటగాళ్ల మ్యాచు ఫీజులో ఐసీసీ 60 శాతం కోత విధించింది. స్లో ఓవర్ రేట్ వల్ల న్యూజిలాండ్ ఆటగాళ్లపై మ్యాచ్ రెఫరీ జరిమానా విధించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.

నిర్ణీత సమయం కన్నా మూడు ఓవర్ల పాటు ఆటను ఆలస్యం చేశారనే ఆరోపణపై ఆ కోత విధించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క ఓవర్ ఆలస్యానికి 20 శాతం కోత విధిస్తారు. దాంతో న్యూజిలాండ్ బౌలర్లు మూడు ఓవర్ల పాటు ఆలస్యం చేయడంతో వారికి ఆ శిక్ష పడింది. 

Also Read: కపిల్ దేవ్, ధోనీల రికార్డును బద్దలు కొట్టిన రవీంద్ర జడేజా

న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ ఆ శిక్షను అంగీకరించాడని, ఈ విషయంపై అధికారిక వాదనలు వినాల్సి అవసరం లేదని ఐసీసీ తెలిపింది. భారత్ జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఇది న్యూజిలాండ్ తొలి తప్పిదం కాగా, ఇండియా గత మూడు మ్యాచుల్లో తప్పులు చేసింది. రెండు టీ20లు, తొలి వన్డేలో టీమిండియాకు ఇదే కారణంపై మ్యాచు ఫీజులో కోత విధించారు

Also Read: కివీస్ పై సిరీస్ ఓటమి: విరాట్ కోహ్లీ ఓదార్పు మాటలు ఇవీ..