ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. బౌలర్లకు మరో అస్త్రం.. బ్యాటర్లకు చుక్కలే..
క్రికెట్ అభిమానులకు పండగలాంటి ఐపీఎల్ 2024 (IPL 2024) మరి కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ సీజన్ లో బీసీసీఐ (BCCI) ఓ కొత్త రూల్ అమలు (IPL 2024 new bouncer rule) చేయనుంది. దీని వల్ల బౌలర్ల చేతికి మరో అస్త్రం దొరికినట్టు అయ్యింది. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే ?
IPL 2024 new bouncer rule : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ కు ఇంకా మూడు నెలల సమయం ఉండటంతో ఫ్రాంచైజీలు కొత్త సీజన్ కు సన్నద్ధమవుతున్నాయి. డిసెంబర్ 19న జరిగే వేలంతో ఐపీఎల్ 2024 కోసం జట్లు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఐపీఎల్ 2024 లో ఓ కొత్త రూల్ అమల్లోకి రానుంది. దీని వల్ల బౌలర్ల చేతికి మరో అస్త్రం రానుండగా.. బ్యాటర్లకు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది.
దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? మరణ వార్తలపై ఛోటా షకీల్ ఏమన్నాడంటే ?
ఐపీఎల్ 2024 సీజన్ తో ఓ కొత్త రూల్ ను తీసుకురావాలని బీసీసీఐ నిర్ణయించింది. ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసే అవకాశాన్ని బౌలర్లకు కల్పించింది. ఇది వరకు ఒకే బౌన్సర్ వేసేందుకు అవకాశం ఉంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2024లో బౌలర్లు ఒక ఓవర్లో కాకుండా రెండు బౌన్సర్లు వేయడానికి అనుమతిస్తారు.
ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023-24లో ఈ కొత్త నిబంధనను అమలు చేశారు. సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న భారత పేసర్ ఉనద్కత్ ఈ నిబంధనపై మాట్లాడారు. ఈ చిన్న మార్పుతో భారీ ప్రభావం కనిపిస్తుందని చెప్పారు. ఒక ఓవర్ కు రెండు బౌన్సర్లు ఎంతగానో ఉపయోగపడతాయని తాను భావిస్తున్నానని, బ్యాట్స్ మెన్ కంటే బౌలర్ కు అదనపు ప్రయోజనం చేకూర్చే అంశాల్లో ఇదొకటి అని తాను భావిస్తున్నట్లు ఉనద్కత్ తెలిపారు.
మైనర్ బాలికపై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష
‘‘ఎందుకంటే.. ఉదాహరణకు, నేను నెమ్మదిగా బౌన్సర్ బౌలింగ్ చేస్తే... గతంలో అయితే బ్యాట్స్ మన్ ఇక కచ్చితంగా బౌన్సర్ రాదని చెప్పేస్తాడు. అయితే ప్రస్తుతం ఓవర్ ప్రారంభంలో నెమ్మదిగా ఒక బౌన్సర్ వేసినప్పటికీ, ఇంకో దాన్ని ఓవర్ చివరిలో ఉపయోగించుకోవచ్చు. అయితే బౌన్స్ వేయరాని బౌలర్ ఇక ఇందులో జాగ్రత్తగా ఉండాలి. ఈ నియమం బౌలర్ కు మరో ఆయుధాన్ని ఇస్తుంది. ఇది చాలా చిన్న మార్పు అని నేను భావిస్తున్నాను. కానీ ఇది చాలా పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ’’ అని తెలిపారు.