దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? మరణ వార్తలపై ఛోటా షకీల్ ఏమన్నాడంటే ?
ముంబై వరుస పేలుళ్ల ప్రధాన సూత్రదారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (underworld don Dawood Ibrahim) చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై అతడి సన్నిహితుడు ఛోటా షకీల్ (Chhota Shakeel) స్పందించారు. దావుద్ ఇబ్రహీంకు ఏం కాలేదని, బాగానే ఉన్నాడని చెప్పాడు.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచీలోని ఓ హాస్పిటల్ లో మరణించాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సన్నిహితుడు చోటా షకీల్ మౌనం వీడారు. ఈ పుకార్లు నిరాధారమైనవని, అండర్ వరల్డ్ డాన్ 1000 శాతం ఫిట్ గా ఉన్నాడని షకీల్ సోమవారం ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో చెప్పారు. అండర్ వరల్డ్ డాన్ కు విషమిచ్చి చంపినట్లు వచ్చిన పుకార్లను ఆయన తోసిపుచ్చారు.
ఐదువేల వజ్రాలతో రామ్ మందిర్ థీం నెక్లెస్.. సూరత్ వ్యాపారి వినూత్న ప్రయోగం..
ఇదిలా వుండగా.. భారత్ మోస్ట్ వాంటెడ్ కు విష ప్రయోగం జరిగే అవకాశం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు తోసిపుచ్చినట్లు సమాచారం.1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుకు బాధ్యుడైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆసుపత్రిలో చేర్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే కొందరు నెటిజన్లు అండర్ వరల్డ్ డాన్ చనిపోయాడని పేర్కొన్నారు.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ను గృహనిర్బంధంలో ఉంచారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే తన గృహ నిర్బంధంపై వస్తున్న వార్తలను క్రికెటర్ తోసిపుచ్చాడు. దావూద్ ఇబ్రహీం గురించి మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. కాగా.. ఛోటా షకీల్ తెలిపిన వివరాల ప్రకారం దావూద్ ఇబ్రహీం విషప్రయోగానికి గురికాలేదు, చనిపోలేదు.
కలవరపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1.. గత వేరియంట్ల కంటే వేగం..
కాగా.. 1993లో 250 మందిని పొట్టనబెట్టుకుని, వేలాది మందిని గాయపరిచిన పేలుళ్ల సూత్రధారిగా ఉన్న దావూద్ ఇబ్రహీం గత దశాబ్దాలుగా పాకిస్థాన్ లోనే ఉంటున్నాడు. అతడు కరాచీలోని అప్ మార్కెట్ క్లిఫ్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడని భారత అధికారులు భావిస్తున్నారు. అయితే దీనిని పాకిస్తాన్ దీనిని ఖండించింది.
పెళ్లినాటి భార్య ఫొటో షేర్ చేసిన కేటీఆర్.. ఏం చెప్పారంటే...
అయితే దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ ముంబైలో నేర కార్యకలాపాలను నియంత్రిస్తున్నాడని భావిస్తున్నారు. పాకిస్తాన్ లో అతడు మజాబిన్ అనే పాకిస్తానీ పఠాన్ ను వివాహం చేసుకున్నాడని, అతడకి ముగ్గురు మరుఖ్, మెహ్రిన్, మాజియా, మోహిన్ నవాజ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది.