మైనర్ బాలికపై అత్యాచారం.. బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు అత్యాచార కేసులో దోషిగా తేలారు. మైనర్ పై అత్యాచారం చేసిన కేసులో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించింది.
మైనర్ పై అత్యాచారం చేసిన ఘటనలో బీజేపీ ఎమ్మెల్యేకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాగే రూ.10 లక్షల ఫైన్ పడింది. ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలోని దుద్ది అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే రామదులార్ గోండ్ 2014లో సోన్ భద్రలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ కేసులో అప్పటి నుంచి విచారణ సాగుతోంది.
కలవరపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1.. గత వేరియంట్ల కంటే వేగం..
తాజాగా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అదనపు జడ్జి ఆయనను దోషిగా నిర్ధారించారు. 25 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 లక్షల జరిమానా విధించారు. వాస్తవానికి ఆయనపై డిసెంబర్ 15వ తేదీన కోర్టు శిక్ష విధించింది. గోండ్ 2022లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ యూపీ అసెంబ్లీ నుంచి ఆయనపై ఇంకా అనర్హత వేటు పడలేదు. వాస్తవానికి ప్రజాప్రాతినిధ్య చట్టం -1951 ప్రకారం దోషిగా తేలి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధిని నేరం రుజువు చేసిన తేదీ నుంచి అనర్హుడిగా ప్రకటిస్తారు. అలాగే మరో ఆరు నెలల పాటు అనర్హులుగా ఉంటారు.
ఐదువేల వజ్రాలతో రామ్ మందిర్ థీం నెక్లెస్.. సూరత్ వ్యాపారి వినూత్న ప్రయోగం..
అయితే దీనిపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పందించారు. బీజేపీ ఎమ్మెల్యే అయినందుకే రామదులార్ గోండ్ కు ప్రత్యేక గౌరవం ఇస్తున్నారా ? రక్షణ కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. ఎస్పీ నేత ఆజంఖాన్, ఆయన కుమారుడు అబ్దుల్లాను దోషులుగా నిర్ధారించిన 48 గంటల్లోనే అసెంబ్లీ నుంచి అనర్హులుగా ప్రకటించారని గుర్తు చేశారు. మరి గోండుపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఎల్‌కే అద్వానీ, ఎంఎం జోషిలను ప్రారంభోత్సవానికి రావద్దన్న రామ్ టెంపుల్ ట్రస్ట్
కాగా.. 2020 ఫిబ్రవరిలో టీనేజర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉత్తరప్రదేశ్ కు చెందిన మరో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.