Asianet News TeluguAsianet News Telugu

బాధేసింది: అంబటి రాయుడిపై ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్య

ప్రపంచ కప్ జట్టుకు అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంపై నిజంగా బాధేసిందని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు.సుదీర్ఘ ఫార్మాట్ పై ఎందుకు దృష్టి పెట్టడం లేదని తాను రాయుడిని అడిగినట్లు చెప్పారు.

MSK Prasad reveals the reason behind not selecting Ambati Rayudu
Author
Mumbai, First Published Feb 6, 2020, 3:16 PM IST

ముంబై: ప్రపంచ కప్ జట్టుకు అంబటి రాయుడిని ఎంపిక చేయలేకపోవడంపై తాను బాధపడినట్లు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అలా జరగడం బాధాకరమని అన్నాడు. 2016 జింబాబ్వే పర్యటన తర్వాత సుదీర్ఘ ఫార్మాట్ పై దృష్టి సారించాలని తాను అంబటి రాయుడికి సూచించినట్లు తెలిపారు. 

పదవీ కాలం ముగిసిపోయినందున కొద్ది రోజుల్లు ప్రసాద్, గగన్ ఖోడా సెలెక్షన్ కమిటీ నుంచి తప్పుకోనున్నారు వారి స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేయడానికి బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. 

also Read: అంబటి రాయుడు శ్రేయస్ అయ్యర్: సేమ్ టు సేమ్@4

అంబటి రాయుడి గురించి తాను తీవ్రంగా ఆలోచించానని, ప్రపంచ కప్ జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోకపోవడం చాలా సున్నితమైందని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. 2016 జింబాబ్వే పర్యటన తర్వాత అంబటి రాయుడిని టెస్టు జట్టుకు ఎంపిక చేసే విషయాన్ని తమ కమిటీ పరిశీలించిందని ఆయన చెప్పారు. సుదీర్ఘ ఫార్మాట్ పై ఎందుకు దృష్టి సారించడం లేదని తాను అంబటి రాయుడిని అడిగినట్లు ఆయన తెలిపారు. 

కేవలం ఐపిఎల్ ప్రదర్శన ఆధారంగానే అంబటి రాయుడదు వన్డే జట్టులోకి వచ్చాడని, ఇది సరి కాదని చాలా మంది అభిప్రాయపడ్డారని, ఆ తర్వాత రాయుడి శారీక దార్ఢ్యంపై ఎన్సీఏలో ఒక నెల రోజులు దృష్టి సారించామని, అతడికి సాయం చేశామని, అందుకు తగినట్లుగానే రాణించాడని ఎమ్మెస్కే చెప్పారు. దురదృష్టవశాత్తు అతడికి జరిగినదానిపట్ల తాను చాలా బాధపడ్డానని ఆయన చెప్పారు. 

Also Read: దేవుడు అవకాశం ఇచ్చాడు... అజారుద్దీన్ కి రాయుడు సూచన

Follow Us:
Download App:
  • android
  • ios