దేవుడు అవకాశం ఇచ్చాడు... అజారుద్దీన్ కి రాయుడు సూచన
అంబటి రాయుడు అసహనంతో ఉన్నాడని... అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అజారుద్దీన్ పేర్కొన్నారు. కాగా... మళ్లీ అజహర్ చేసిన కామెంట్స్ కి అంబటి రాయుడు కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్( హెచ్ సీఏ)లో అవినీతి రాజ్యమేలుతోందంటూ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన కామెంట్స్.. తీవ్ర వివాదానికి దారి తీశాయి. శనివారం.. హెచ్ సీఏలో అవినీతిని ప్రస్తావిస్తూ అంబటి రాయుడు ట్వీట్ చేశారు. కాగా.... ఆ ట్వీట్ విషయాన్ని మంత్రి కేటీఆర్ కి తెలియజేస్తూ.. అంబటి ట్వీట్ చేశారు. కాగా... అంబటి చేసిన ట్వీట్ పై అజారుద్దీన్ మండిపడ్డాడు.
అంబటి రాయుడు అసహనంతో ఉన్నాడని... అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అజారుద్దీన్ పేర్కొన్నారు. కాగా... మళ్లీ అజహర్ చేసిన కామెంట్స్ కి అంబటి రాయుడు కౌంటర్ ఇవ్వడం గమనార్హం.
AlsoRead అజరుద్దీన్ హెచ్ సిఎపై కేటీఆర్ కు అంబటి రాయుడు ఫిర్యాదు...
‘ హాయ్ అజహర్.. దీనిని వ్యక్తిగతంగా తీసుకోకు. ఈ విషయం మనిద్దరికంటే పెద్దది. హెచ్ సీయూలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. హైదరాబాద్ క్రికెట్ ను బాగు చేసేందుకు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. పాతకాలపు తప్పుడు వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలని నేను నిన్ను కోరుకుంటున్నాను.అలా చేస్తే భవిష్యత్తు తరాల క్రిరకెటర్లను రక్షించినవాడివి అవుతావు’ అని పేర్కొన్నాడు.
కాగా... శనివారం హెచ్‌సీఏలో అవినీతే రాజ్యమేలుతోందని, డబ్బుతో అసోసియేషన్‌ను ప్రభావితం చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయిందంటూ రాయుడు వ్యాఖ్యానించాడు. ఈ మేరకు ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌కు సైతం ట్వీట్ చేశాడు. హెచ్‌సీఏను కాపాడాల్సిన బాధ్యత కేటీఆర్‌పై ఉందని పేర్కొన్నాడు. హైదరబాద్ కెప్టెన్‌గా తాను నిస్సాహాయ స్థితిలో ఉన్నానని, దాంతోనే వచ్చే రంజీ సీజన్‌లో జట్టుకు దూరంగా ఉండదల్చుకున‍్నాననంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి... తాజాగా అంబటి చేసిన వ్యాఖ్యలకు అజహర్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.