అంబటి రాయుడు శ్రేయస్ అయ్యర్: సేమ్ టు సేమ్@4
ఈ ప్రస్తుత పరిస్థితికి ఒక సంవత్సరం కింద జరిగిన ఒక సంఘటనను జ్ఞప్తికి తీసుకొస్తుంది. గత సంవత్సరం కరెక్ట్ గా ఇదే సమయానికి, కాకపోతే ఒక రోజు ముందు భారత్ తన న్యూజిలాండ్ పర్యటనను ప్రారంభిస్తూ తొలి వన్డేను ఆడింది.
ఆక్లాండ్: భారత్ నేటి న్యూజీలాండ్ మ్యాచ్ లో అదరగొట్టింది. 5 టి 20ల సిరీస్ లో భాగంగా నేటి నుండి మొదలైన తొలి వన్డేలో భారత్ ఒక సమగ్రమైన విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోని భారత్ అదరగొట్టింది.
204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఈ మ్యాచులో కోహ్లీ, రోహిత్ ల భారీ ఇన్నింగ్స్ లేకుండానే గెలవడం విశేషం. రాహుల్ కూడా ఒక మంచి పునాది వేసినప్పటికీ నేటి మ్యాచులో ఒక నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడింది మాత్రం శ్రేయాస్ అయ్యర్ అని చెప్పవచ్చు.
శ్రేయస్ అయ్యర్ నెంబర్ 4 లో బ్యాటింగ్ కి దిగాడు. బ్యాటింగ్ లో కోహ్లీతో జత కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. కోహ్లీ కూడా వెళ్లిన తరువాత తానే ఛార్జ్ తీసుకున్నాడు. తొలుత దూబే ఆ తరువాత మనీష్ పాండేతో కలిసి లాంఛనాన్ని పూర్తి చేసాడు.
Also read; ముందు రాహుల్, వెనక శ్రేయస్.... కోహ్లీకి రిలీఫ్... ప్రపంచకప్ టీంపై భరోసా
ఈ మ్యాచ్ తరువాత బ్యాటింగ్ లైన్ అప్ లో మిస్ అవుతున్న ఒక చిన్న లింక్ కి కరెక్ట్ సమాధానం దొరికింది. అదే నెంబర్ 4. అందునా ప్రపంచ కప్ కి ముంగిట ఇలాంటి ఆటతీరుతో శ్రేయస్ అయ్యర్ ఆకట్టుకోవడం టీం ఇండియా శిబిరంలో ఆనందాన్ని నింపింది.
ఈ ప్రస్తుత పరిస్థితికి ఒక సంవత్సరం కింద జరిగిన ఒక సంఘటనను జ్ఞప్తికి తీసుకొస్తుంది. గత సంవత్సరం కరెక్ట్ గా ఇదే సమయానికి, కాకపోతే ఒక రోజు ముందు భారత్ తన న్యూజిలాండ్ పర్యటనను ప్రారంభిస్తూ తొలి వన్డేను ఆడింది.
తొలి వన్డేలో డి ఎల్ ఎస్ పద్ధతి ద్వారా భారత్ మ్యాచ్ ను కైవసం చేసుకుంది. ఆ తొలి మ్యాచులో 13 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు అంబటి రాయుడు. ఆ తరువాతి నాలుగు మ్యాచుల్లో భారత్ సిరీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
47,40 నాట్ అవుట్,90 పరుగులు సాధించాడు. ఆఖరు మ్యాచ్ లో మం అఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అలా ఆ సిరీస్ లో భారత జట్టు అపూర్వ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ సిరీస్ కి ముందు కూడా భారత జట్టు నెంబర్ 4 సమస్యతో కొట్టుమిట్టాడుతుంది. రాయుడును చూసినవారంతా ఆ బాధ తీరిపోయిందని భావించారు. భారత కెప్టెన్ కోహ్లీ కూడా ఇదే విధమైన ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు.
సీన్ కొంచం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే... రాయుడికి ప్రపంచ కప్ ప్రాబబుల్స్ లిస్టులో కనీసం చోటు కూడా దక్కలేదు. అప్పట్లో 3 డైమెన్షనల్ ప్లేయర్ అని విజయ్ శంకర్ ని అన్నందుకు 3డి గ్లాసెస్ కొనుక్కుంటానని సెటైర్ వేసి టీం నుంచి రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. (ఆ తరువాత మల్లి క్రికెట్ ఆడతానని ప్రకటించడం అది వేరే విషయం)
ఇలా అప్పుడు ప్రపంచ కప్ ముంగిట భారత్ సూపర్ స్టార్ గా, భారత్ కు ఉన్న నెంబర్ 4 సమస్యకు ఒక మంచి సొల్యూషన్ గా కనపడ్డ రాయుడు... ఆ తరువాత కొద్దీ కాలానికే టీం ఇండియా నుండి కనుమరుగయ్యాడు.
ఇప్పుడు మరోమారు ప్రపంచ కప్ ముంగిట భారత్ కు మళ్ళీ అదే నెంబర్ 4 సమస్య. వేదిక కూడా న్యూజిలాండ్ దేశమే. ఇప్పుడు కూడా ఒక ఆశాకిరణం ఉడాయించాడు. కాకపోతే అప్పట్లో రాయుడు వన్డే ప్రపంచ కప్ ముంగిట ఉదయిస్తే... శ్రేయస్ అయ్యర్ టి 20 ప్రపంచకప్ ముంగిట ఉదయించాడు.
ఇలాంటి ఎన్నో పరిణామాలు పునరావృతమవుతున్నవేళ శ్రేయాస్ అయ్యర్ కూడా మరో రాయుడు అవుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ రాయుడికి, అయ్యర్ కు ఒక ప్రధానమైన తేడా ఉంది.
రాయుడు అప్పుడు కెరీర్ చరమాంకంలో ఉన్నాడు. అయ్యర్ ఒక వర్ధమాన క్రికెటర్. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయస్థాయిలో నిలదొక్కుకుంటున్నాడు. ఇంకా ఎన్నో సంవత్సరాల క్రికెటింగ్ జీవితం అతనికి ఉంది.
అన్నిటికంటే ముఖ్యంగా శ్రేయాస్ అయ్యర్ చాలా కూల్ ప్లేయర్. అతడు ఒకవేళ టీం లో స్థానం కోల్పోయినా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తిరిగి టీంలోకి వస్తాడు.
ఏది ఏమైనా... ఇలా న్యూజిలాండ్ టూర్ లోనే, అందునా ప్రపంచ కప్ కి ముందు ఇలాంటి పరిస్థితులు కేవలం సంవత్సర కాలంలోనే మళ్ళీ పునరావృతమవడం నిజంగా ఆశ్చర్యకరం.