ప్రపంచ కప్ తర్వాత టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. అయితే భారత సైన్యానికి సేవలందించే సదుద్దేశ్యంతో అతడు వెస్టిండిస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకున్నాడు. కానీ ఆర్మీ విధులు ముగించుకుని ప్రస్తుతం అందుబాటులో వున్న అతడిని దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ కు సెలెక్టర్లు ఎంపికచేయలేదు. జూనియర్లకు అవకాశమిస్తూ సెలెక్టర్లు ధోనిని పక్కనబెట్టడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

'' ధోనికి ప్రస్తుతం భారత జట్టులో చోటు దక్కుతుందా...లేదా అన్నది కెప్టెన్ విరాట్ కోహ్లీ  నిర్ణయంపైనే ఆధారపడి వుంటుంది. కోహ్లీతో పాటు టీమిండియా మేనేజ్ మెంట్ అతడి అవసరం  వుందనుకుంటేనే జట్టులోకి వస్తాడు. కాబట్టి వచ్చే నెల దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సీరిస్ కు ధోని అవసరం లేదని కోహ్లీ భావించినట్లున్నాడు. అందువల్లే అతడికి జట్టులో చోటు దక్కలేదు.

స్వదేశంలో జరిగే ఈ టీ20 సీరిస్ కు ధోని ఎంపికవకపోవడం నన్నేమీ ఆశ్చర్యపర్చలేదు. 2020 లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం యువకులను సంసిద్దం చేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందువల్లే రిషబ్ పంత్ కి వీలైనన్ని ఎక్కువ అవకాశాలిస్తోంది. ఇది మంచి నిర్ణయమే. దక్షిణాఫ్రికా సీరిస్ ద్వారా పంత్ ఫామ్ ను అందిపుచ్చుకుని సత్తా చాటుతాడని నమ్ముతున్నా.'' అని గంగూలీ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

దక్షిణాఫ్రికాతో టీ20 సీరిస్...ధోనికి దక్కని చోటు

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కి ధోనీ దూరం.. కారణం ఇదేంనంటున్న ఎమ్మెస్కే