IPL 2024 Final : అదరగొడుతారనుకుంటే ఆలౌట్ అయ్యారు.. అసలు కారణం ఇదేనా?

IPL 2024 Final : ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత బౌలింగ్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ కు చెమ‌ట‌లు ప‌ట్టించింది. కేకేఆర్ బౌల‌ర్ల దెబ్బ‌కు హైద‌రాబాద్ ఆలౌట్ అయింది. 
 

Kolkata Knight Riders's superb bowling, Sunrisers Hyderabad all out in IPL 2024 Final match, Is this the real reason? RMA

IPL 2024 Final : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2024) ఫైన‌ల్ మ్యాచ్‌లో అద‌రగొడుతుంద‌న‌కుంటే ఆలౌట్ అయింది సన్‌రైజర్స్ హైదరాబాద్. చెత్త బ్యాటింగ్ తో వ‌రుస వికెట్లు కోల్పోయింది. వికెట్లు ప‌డుతున్నా షాట్లు ఆడుతూ వ‌రుస‌గా ప్లేయ‌ర్లు పెవిలియ‌న్ చేరారు. కేకేఆర్ ముందు 113 ప‌రుగులు స్వ‌ల్ప టార్గెట్ ను ఉంచింది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 ఫైన‌ల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ బ్యాటింగ్ కు దిగింది. ఆరంభం నుంచి వికెట్లు ప‌డుతున్న ఏ ఒక్క ప్లేయ‌ర్ కూడా వికెట్లు ప‌డ‌కుండా ప‌రుగులు చేయాల‌నే బ్యాటింగ్ చేసినట్టుగా క‌నిపించ‌లేదు. చెత్త షాట్లు ఆడుతూ ఔట్ అయ్యారు. భారీ అంచ‌నాలున్న హైద‌రాబాద్ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్ డ‌కౌట్ కాగా, అభిషేక్ శ‌ర్మ 2 ప‌రుగుల వ‌ద్ద పెవిలియ‌న్ కు చేరాడు.

IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 విజేత‌కు ప్రైజ్ మ‌నీ ఎంత‌? ర‌న్న‌ర‌ప్ ఎంత?

అభిషేక్ శ‌ర్మ తొలి ఓవ‌ర్ లోనే స్టార్క్ బౌలింగ్ లో ఔట్ కాగా, త‌ర్వాతి ఓవ‌ర్ లో ట్రావిస్ హెడ్ వైభవ్ అరోరా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి ఫైన‌ల్ లో 13 బంతులు ఆడి 9 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. ఐడెన్ మార్క్ర‌మ్ 20 ప‌రుగులు, నితీష్ రెండ్డి 13, హెన్రిచ్ క్లాసెన్ 16, షాబాజ్ అహ్మ‌ద్ 8, అబ్దుల్ స‌మ‌ద్ 4 ప‌రుగులు, ఉన‌ద్క‌త్ 4 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యారు. చివ‌ర‌లో కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్  24 ప‌రుగులు చేయ‌డంతో హైద‌రాబాద్ స్కోర్ 100+ మార్కును అందుకుంది.

బౌలింగ్ లో దుమ్మురేపిన‌ కేకేఆర్

ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌలింగ్ ను సూప‌ర్ అని చెప్పాలి. మొద‌టి నుంచి హైద‌రాబాద్ ఇన్నింగ్స్ ముగిసే వ‌ర‌కు అద్భుత‌మైన బౌలింగ్ తో హైద‌రాబాద్ ప్లేయ‌ర్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు. కేకేఆర్ బౌలింగ్ ను ప్రారంభించిన స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ తొలి ఓవ‌ర్ లోనే అద్భుత‌మైన బౌలింగ్ తో అభిషేక్ శ‌ర్మ‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రాహుల్ త్రిపాఠి వికెట్ ను కూడా తీసుకున్నాడు. హ‌ర్షిత్ రాణా 2 వికెట్లు, ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు తీసుకున్నారు. మిగ‌త బౌల‌ర్లు త‌లా ఒక వికెట్ తీసుకున్నారు.

IPL 2024 FINAL : హైదరాబాద్ హీరోలు జీరోలయ్యారు మామా.. ఫైనల్లో ఇదెక్కడి ఆట సామి.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios