IPL 2024 Final : హైదరాబాద్ హీరోలు జీరోలయ్యారు మామా.. ఫైనల్లో ఇదెక్కడి ఆట సామి.. !

IPL 2024 Final : ఐపీఎల్ 2024 ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ మెరుపులు మెరిపిస్తుంద‌నుకుంటే.. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ తో అద‌ర‌గొట్టింది. దీంతో వ‌రుస వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.
 

Sunrisers Hyderabad's worst batting performance in ipl 2024 final RMA

IPL 2024 Final : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2024) ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ బ్యాటింగ్ కు దిగింది. హైద‌రాబాద్ ఓపెన‌ర్ల‌పై భారీ అంచ‌నాలు పెట్టుకున్న అభిమానుల‌ను మ‌రోసారి ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ‌లు నిరాశ‌ప‌రిచారు. ఈ సీజ‌న్ మొత్తం త‌మ బ్యాట్ తో ప‌రుగుల వ‌ర‌ద పారించిన ఈ జోడి ఫైన‌ల్ లో తుస్సు మంది. క్రీజులోకి ఇలా వ‌చ్చి అలా పెవిలియ‌న్ కు చేరారు.

అభిషేక్ శ‌ర్మ తొలి ఓవ‌ర్ లోనే స్టార్క్ బౌలింగ్ లో రెండు ప‌రుగుల వ‌ద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ మ‌రోసారి నిరాశ‌ప‌రుస్తూ రెండో ఓవ‌ర్ లో డ‌కౌట్ గా వెనుదిరిగాడు. త‌న‌కు అవ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ మంచి ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ త్రిపాఠి ఫైన‌ల్ లో రాణించ‌లేక‌పోయాడు. 13 బంతులు ఆడి 9 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. ఐడెన్ మార్క్ర‌మ్ 20 ప‌రుగులు వ‌ద్ద ఔట్ అయ్యాడు. నితీష్ రెండ్డి 13, హెన్రిచ్ క్లాసెన్ 16, షాబాజ్ అహ్మ‌ద్ 8, అబ్దుల్ స‌మ‌ద్ 4 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యారు. 7 ఓవ‌ర్ల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ స‌మ‌యంలో త‌ర్వాత వ‌చ్చిన బ్యాట‌ర్లు కూడా చెత్త షాట్లు ఆడుతూ వికెట్లు వ‌దులుకున్నారు. 14 ఓవ‌ర్ల‌లో 90 ప‌రుగులు చేసిన హైద‌రాబాద్ 8 వికెట్లు కోల్పోయింది.

 

 

 

IPL 2024: 17 ఏళ్ల‌లో మూడోసారి ఇలా ఐపీఎల్ ఫైన‌ల్... 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios