Asianet News TeluguAsianet News Telugu

ఆల్ రౌండ్ షో.. ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ గా కేకేఆర్.. ఫైనల్లో హైద‌రాబాద్ పై గెలుపు

IPL 2024 Final : ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌రగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి హైద‌రాబాద్ ను చిత్తు చేసి ఛాంపియ‌న్ గా నిలిచింది. 
 

Kolkata Knight Riders All round show, KKR as IPL 2024 champion.. Victory over Hyderabad in the final RMA
Author
First Published May 26, 2024, 10:57 PM IST

IPL 2024 Final : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 (ఐపీఎల్ 2024) ఫైన‌ల్ మ్యాచ్‌లో అద‌రగొడుతుంద‌నుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తుస్సు మంది. ఫైన‌ల్ పోరులు ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టిన కోల్ కాత నైట్ రైడ‌ర్స్ ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది. మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. శ్రేయాస్ అయ్య‌ర్ కెప్టెన్సీలో కేకేఆర్ కు ఇది తొలి ఐపీఎల్ ట్రోఫీ కాగా, గ‌తంలో గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకుంది.

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2024 ఫైన‌ల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన హైద‌రాబాద్ తొలుత బ్యాటింగ్ చేసి కోల్ క‌తా ముందు 114 ప‌రుగులు టార్గెట్ ను ఉంచింది. కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి 10.3 ఓవ‌ర్ల‌లో టార్గెట్ ను అందుకుంది. ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ టీమ్ 18.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.

హైద‌రాబాద్ టీమ్ లోని ఏ ప్లేయ‌ర్ గా కూడా పెద్ద ఇన్నింగ్స్ ను ఆడ‌లేక‌పోయారు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడే ట్రావిస్ హెడ్ డ‌కౌట్ కాగా, అభిషేక్ శ‌ర్మ 2 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. రాహుల్ త్రిపాఠి 9, ఐడెన్ మార్క్ర‌మ్ 20, నితీష్ రెడ్డి 13, హెన్రిచ్ క్లాసెన్ 16, షాబాజ్ అహ్మ‌ద్ 8, అబ్దుల్ స‌మ‌ద్ 4, ఉన‌ద్క‌త్ 4 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యారు. చివ‌ర‌లో కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్  24 ప‌రుగులు చేయ‌డంతో హైద‌రాబాద్ స్కోర్ 100+ మార్కును అందుకుంది. కేకేఆర్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ 2 వికెట్లు, హ‌ర్షిత్ రాణా 2, ఆండ్రీ రస్సెల్ 3 వికెట్లు తీసుకున్నారు. మిగ‌త బౌల‌ర్లు త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.

వెంక‌టేస్ అయ్య‌ర్ సూప‌ర్ ఇన్నింగ్స్.. మూడోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన కేకేఆర్

114 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన కేకేఆర్ ఆడుతూ పాడుతూ టార్గెట్ ను అందుకుని ఐపీఎల్ 2024 ఛాంపియ‌న్ గా నిలిచింది. లక్ష్య ఛేద‌న‌లో రహ్మానుల్లా గుర్బాజ్ 39 పరుగులు, సునీల్ న‌రైన్ 6 ప‌రుగులు చేశారు. అయ్య‌ర్ బ్ర‌ద‌ర్స్ మ‌రోసారి కేకేఆర్ ను విజ‌యం వైపు న‌డిపించారు. మ‌రీ ముఖ్యంగా వెంక‌టేష్ అయ్య‌ర్ అద్భుత‌మైన బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. కేకేఆర్ గెలుపులో కీల‌క పాత్ర పోషించిన వెంక‌టేష్ అయ్య‌ర్ త‌న 52 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు బాదాడు. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బౌల‌ర్లు సూప‌ర్ బౌలింగ్ తో హైద‌రాబాద్ దెబ్బ‌కొట్టారు. ఆరంభం నుంచి అద్భుత‌మైన బౌలింగ్ చేస్తూ దుమ్మురేపారు. దీంతో హైద‌రాబాద్ టీమ్ త‌క్కువ స్కోర్ కే ఆలౌట్ అయింది. 

 

 

IPL 2024 FINAL : అదరగొడుతారనుకుంటే ఆలౌట్ అయ్యారు.. అసలు కారణం ఇదేనా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios