'భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కి విరాట్‌ కోహ్లీ దూరం కావడం సిగ్గుచేటు'

James Anderson-Virat Kohli: భార‌త్-ఇంగ్లాండ్ ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో టీమిండియా ఇప్పటికే 3-1తో సిరీస్ ను కైవ‌సం చేసుకుంది. చివ‌రిదైన 5వ మ్యాచ్ ధ‌ర్మ‌శాల‌లో జ‌ర‌గ‌నుండ‌గా, ఇంగ్లాండ్ స్టార్ ప్లేయ‌ర్ జేమ్స్ ఆండర్సన్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు  చేశాడు. 
 

Its a shame that Virat Kohli has been ruled out of the India-England Test series: James Anderson RMA

IND vs ENG, James Anderson-Virat Kohli: భార‌త క్రికెట్ స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ కు దూరమ‌య్యాడు. ఈ సిరీస్ లో చివ‌రి 5వ టెస్టు మ్యాచ్ కు కూడా  ఆడటం లేదు. ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీ గైర్హాజరు గురించి ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇరు దేశాల‌కు కీల‌క‌మైన ఈ టెస్ట్ సిరీస్‌కు కోహ్లీ దూరమవడం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యానించాడు.

జేమ్స్ అండర్సన్-విరాట్ కోహ్లి మధ్య ఆట‌ను చూడ‌టానికి క్రికెట్ ప్ర‌పంచ ఆస‌క్తి ఎదురుచూసింది. కానీ, విరాట్ దూరం కావ‌డంతో ఇద్ద‌రి ప్లేయ‌ర్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోరును చూడ‌లేక‌పోయాము. ఇంగ్లాండ్ వెటరన్‌ ఆటగాడు జేమ్స్‌ ఆండర్సన్‌ 10 సార్లు విరాట్‌ కోహ్లి చేతిలో బలి అయ్యాడు. ఇదే స‌మ‌యంలో అండర్సన్‌పై విరాట్ కోహ్లీ 331 పరుగులు చేశాడు. భారత్, ఇంగ్లాండ్ లతో టెస్టు సిరీస్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు అకస్మాత్తుగా జట్టు నుంచి వైదొలిగాడు విరాట్. దీనికి అస‌లు కార‌ణం విరుష్క దంప‌తులు త‌మ రెండో బిడ్డ‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ 'అకాయ్' అనే మగబిడ్డకు ఇటీవ‌లే  జన్మ‌నిచ్చింది.

T20 WORLD CUP 2024: టీమిండియా పై బిగ్ అప్డేట్.. వివ‌రాలు ఇవిగో..

భార‌త్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ప్రసార హక్కులను కలిగి ఉన్న జియో సినిమాస్‌తో జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడ‌నీ, విరాట్ కోహ్లీతో ఆడటానికి ఎదురుచూస్తున్నాన‌ని చెప్పాడు. "అవును, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడితో ఆడేందుకు నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. కానీ విరాట్ కోహ్లీ ఈ టెస్టు సిరీస్‌లో ఆడకపోవడం సిగ్గుచేటు. కొన్నేళ్లుగా మా మధ్య మంచి పోరాటం ఉంది. నేనే కాదు, మొత్తం జట్టు అత్యుత్తమ ఆటగాడితో ఆడేందుకు ఎదురుచూస్తోంది' అని అండర్సన్ అన్నాడు. అలాగే, ''విరాట్ కోహ్లీ మంచి ప్లేయ‌ర్.. ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు కోహ్లీ ఆడనందుకు సంతోషిస్తారు కానీ, మా దృష్టిలో, మనల్ని మనం పరీక్షించుకోవాలంటే, అలాంటి ఆటగాళ్లతో ఆడాలి. అతనికి బౌలింగ్ చేయడం నిజంగా సవాలుతో కూడుకున్నదే. విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లో ఆడకపోవడం నిజంగా సిగ్గుచేటు' అని అండర్సన్ అన్నాడు.

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన భార‌త క్రికెట‌ర్లు వీరే..

ఇదిలావుండ‌గా, విరాట్ కోహ్లి లేకపోయినప్పటికీ, రాంచీ టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య 5వ టెస్టు మ్యాచ్ మార్చి 07న ధర్మశాలలో ప్రారంభం కానుంది.  ఇక జేమ్స్ ఆండర్సన్ భారత్‌తో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఆ త‌ర్వాతి మూడు మ్యాచ్‌లలో ఆరు ఇన్నింగ్స్‌ల నుండి 8 వికెట్లు తీశాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో జేమ్స్ అండర్సన్ 698 వికెట్లు పడగొట్టగా, మరో 2 వికెట్లు తీస్తే 700 వికెట్ల క్లబ్‌లో చేరతాడు.

టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు సాధించిన టాప్-5 భార‌త క్రికెట‌ర్లు వీరే !

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios