MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన భార‌త క్రికెట‌ర్లు వీరే..

ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన భార‌త క్రికెట‌ర్లు వీరే..

Cricketers who hit 6 sixes in 6 balls: క్రికెట్ లో కొత్త రికార్డులు నుమోద‌వుతూనే ఉన్నాయి. ఒక ఓవ‌ర్ లో రెండుమూడు బౌండ‌రీలు బాదితే ఔర అనుకున్నారు కానీ, ఒక ఓవ‌ర్ లో 6 సిక్స‌ర్లను తొలి సారి వెస్టిండీస్ గ్రేట్ గ్యారీ సోబర్స్ 1968లో  బాదాడు. ఈ త‌ర్వాత న‌లుగురు భార‌త క్రికెట‌ర్లు కూడా ఒకే ఓవ‌ర్ లో 6 సిక్స‌ర్లు బాది చ‌రిత్ర సృష్టించారు.  ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన  నలుగురు భార‌త క్రికెటర్ల వివరాలు గమనిస్తే.. .  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 02 2024, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

1. రవిశాస్త్రి

భారత మాజీ కెప్టెన్, కోచ్ రవిశాస్త్రి ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన మొదటి భారతీయ బ్యాటర్. అతను అంతర్జాతీయ క్రికెట్ లో కాకుండా బరోడాపై 1985 రంజీ ట్రోఫీలో ఈ ఘనతను సాధించాడు. ర‌విశాస్త్రి ముంబై త‌ర‌ఫున ఆడుతూ.. స్పిన్నర్ తిలక్ రాజ్ వేసిన ఒక ఓవర్‌లో వ‌రుస‌గా ఆరు సిక్స్‌లతో విధ్వంసం చేశాడు.  దీంతో క్రికెట్ లో ఒకే ఓవ‌ర్ లో 6 సిక్స‌ర్లు బాదిన రెండవ బ్యాటర్‌గా నిలిచాడు. త‌న ఇన్నింగ్స్ లో 123 బంతుల్లోనే డబుల్ సెంచరీని సాధించాడు. ఇది ఫస్ట్ క్లాస్ (FC) క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీగా రికార్డు సృష్టించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Yuvraj Singh

Yuvraj Singh

2. యువరాజ్ సింగ్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ సునామీ ఇన్నింగ్స్ ను ఎవరు మరచిపోగలరు. యువరాజ్ 12 బంతుల్లో ఫిఫ్టీ కొట్టాడు. ఇది ఇప్పటికీ టీ20Iలలో రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచ‌రీ. ఇంగ్లాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో వాగ్వాదం త‌ర్వాత స్టువర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్ త‌ను ఉతికిపారేశాడు. వ‌రుస‌గా ఒకే ఓవ‌ర్ లో ఆరు సిక్సర్‌లతో టీ20 క్రికెట్ లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. యువరాజ్ 16 బంతుల్లో 58 పరుగులతో త‌న ఇన్నింగ్స్ ను ముగించాడు. ఈ మ్యాచ్ లో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

34
ബി ടീം

ബി ടീം

3. రుతురాజ్ గైక్వాడ్

ఆరు సిక్సర్లు కొట్టడం చాలా అరుదు, కానీ ఒక ఓవర్లో ఏడు కొట్టడం చాలా అరుదైన సంఘటన. విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్రకు నాయకత్వం వహిస్తున్న సమయంలో భారత స్టార్ బ్యాట‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ ఘనత సాధించాడు. అతను 49వ ఓవర్‌లో స్పిన్నర్ శివ సింగ్ బౌలింగ్ లో ఈ ఘ‌న‌త  సాధించాడు. ఏడు సిక్సర్లు (ఒకటి నో బాల్‌లో వచ్చింది) కొట్టాడు. గైక్వాడ్ 43 పరుగులు చేసి లిస్ట్ A క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును సృష్టించాడు. త‌న ఇన్నింగ్స్ లో 159 బంతుల్లో 16 సిక్సర్లు, 10 ఫోర్లతో 220 పరుగులు చేశాడు.

44
Vamsi Krishna, M Vamsi Krishna, six sixes

Vamsi Krishna, M Vamsi Krishna, six sixes

4. వంశీ కృష్ణ:

ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన నాల్గ‌వ భారతీయ బ్యాటర్ ఆంధ్రప్రదేశ్ కు చెందిన అండ‌ర్ 23 క్రికెటర్ వంశీ కృష్ణ . వైఎస్ రాజా రెడ్డి ఏసీపీ క్రికెట్ స్టేడియంలో రైల్వేస్‌తో జరిగిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ 2023-24 మ్యాచ్ లో ఈ ఘ‌న‌త సాధించాడు. అత‌ను రైల్వేస్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ బౌలింగ్ ను ఉతికిపారేస్తూ వంశీకృష్ణ ఒక ఓవర్‌లో 6 సిక్స‌ర్ల‌తో 36 పరుగులు చేసి 64 బంతుల్లో 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved