T20 World Cup 2024: టీమిండియా పై బిగ్ అప్డేట్.. వివరాలు ఇవిగో..
T20 World Cup 2024 - India :ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ అమెరికా, వెస్టిండీస్‌లోని వివిధ వేదికలలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్-2024 ఆడబోయే టీమిండియా జట్టుకు సంబంధించి బిగ్ అప్ డేట్ వచ్చింది.
Team India's T20 World Cup 2024 squad: మరో మెగా క్రికెట్ ఈవెంట్ కు సర్వం సిద్ధమవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఐసీసీ వేగంగా పూర్తి చేస్తోంది. టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 2 నుండి ప్రారంభం కానుంది. ఈ సారి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ), వెస్టిండీస్‌లోని వివిధ వేదికలలో సంయుక్తంగా మెగా టోర్నీని నిర్వహించనున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టును ప్రకటించే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే, వీలైనంత త్వరగానే జట్టును ప్రకటించి, మెగా టోర్నీకి సిద్ధం చేయాలని చూస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024కు కోసం భారత జట్టును మే 1 నాటికి ప్రకటించనుందని స్పోర్ట్స్ టాక్ పెద్ద అప్‌డేట్‌లో పేర్కొంది. ఇది మాత్రమే కాదు, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024కి వచ్చే సమయాన్ని బట్టి జట్లకు రెండు వార్మప్ గేమ్‌లు ఆడే అవకాశం కూడా ఉంటుందని సమాచారం. ఐసీసీ వర్గాల ప్రకారం.. టీ20 వరల్డ్ కప్ 2024 కోసం జట్టును ప్రకటించడం మే 1 చివరి తేదీ. ఏదైనా జట్టు స్క్వాడ్‌లో 15 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. మే 25 వరకు మార్పులు చేయవచ్చు కానీ ఆ తర్వాత ఏదైనా మార్పులకు ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదించాలి. అలాగే ప్రైజ్ మనీపై కూడా నిర్ణీత సమయంలో ప్రకటన రానుంది.
ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదిన భారత క్రికెటర్లు వీరే..
టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ దశలలో భారత్, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, సహ-హోస్ట్ అయిన యూఎస్ఏతో తలపడనుంది. రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024లో రోహిత్ శర్మ భారత్ కు నాయకత్వం వహించడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సెక్రటరీ జైషా ఇటీవల (ఫిబ్రవరి 14న) జరిగిన కార్యక్రమంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఉండే అవకాశముంది. జూన్ 2న ప్రారంభ మ్యాచ్‌లో యూఎస్ఏ తో కెనడాతో తలపడుతుంది. గ్రాండ్ ఫినాలే జూన్ 29న బార్బడోస్‌లో జరగనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థి భారత్-పాకిస్థాన్‌ల మధ్య జూన్ 9న న్యూయార్క్ నగరంలో జరగనుంది.
టెస్టు క్రికెట్ లో అత్యధిక సార్లు 5 వికెట్లు తీసిన టాప్-5 భారత బౌలర్లు వీరే !
గ్రూప్-స్టేజ్ లో భారత్ షెడ్యూల్
భారత్ vs ఐర్లాండ్ - జూన్ 5, న్యూయార్క్
భారత్ vs పాకిస్థాన్ - జూన్ 9, న్యూయార్క్
భారత్ vs యూఎస్ఏ - జూన్ 12, న్యూయార్క్
భారత్ vs కెనడా - జూన్ 15, లాడర్‌హిల్
సచిన్-ధోనీ-విరాట్ కంటే ఖరీదైన ఇల్లు.. ఈ భారత క్రికెట్ క్వీన్ ఎవరో తెలుసా?