Team India : 100 కోట్ల భారతీయుల కల నిజమైన వేళ.. !

Team India : 13 ఏళ్ల క్రితం భారత్ ఐసీసీ వన్డే ప్రపంచ కప్ గెలుచుకోవడంతో వందకోట్లకు పైగా ప్రజల కలలు సాకారమయ్యాయి. క్యాన్సర్ తో పోరాడుతూ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించాడు టీమిండియా స్టార్ యువరాజ్ సింగ్. 
 

It was on this day that after 28 years, the dreams of crores of Indians came true,  India wins ICC ODI World Cup 2011  RMA

ICC ODI World Cup 2011 : 13 సంవత్సరాల క్రితం ఇదే రోజున భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోట్లాది భారతీయుల కలను నిజం చేశాడు. 28 ఏళ్ల తర్వాత భారత్ కు వన్డే ప్రపంచ కప్ లో టైటిల్ ను అందించాడు. ఫైన‌ల్ మ్యాచ్ లో "ధోనీ తనదైన శైలిలో ఫినిష్  చేశాడు. స్టేడియం ఒక్క‌సారిగా హోరెత్తింది. 28 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్ గెలుచుకుంది. డ్రెస్సింగ్ రూమ్ లో పార్టీ ప్రారంభమైంది. ఫైనల్ రాత్రిని అద్భుతంగా అంద‌మైన ఆనంద రాత్రిగా మార్చాడు భార‌త కెప్టెన్ ఎంఎస్ ధోని"... అని రవిశాస్త్రి చెప్పిన‌ మాటలకు 13 ఏళ్లు నిండాయి. వందకోట్ల భార‌తీయుల క‌ల నెరవేరి నేటికి 13 ఏళ్లు నిండాయి.

2011 ఏప్రిల్ 2వ తేదీ ఒక శనివారం సాయంత్రం, 1983 త‌ర్వాత ఎంతో కాలంగా ఎదురు చూసిన ఆనందక్ష‌ణాలు వ‌చ్చాయి. సచిన్ టెండూల్కర్ కల, అతని భారీ ప్రేరణ.. కెరీరో సాధించాల‌నుకున్న‌ది ప్రపంచ కప్.. 1983లో భారత్ ప్రపంచకప్ గెలవడం చూశాననీ, అది తన జీవితంలో టర్నింగ్ పాయింట్ అని సచిన్ పేర్కొన్నాడు. నిజానికి అది జరిగింది. తన కెరీర్ లో ప్రతి రికార్డును సృష్టించిన మాస్టర్ బ్లాస్టర్ కు ఎట్టకేలకు తన దేశవాళీ క్రికెట్ లో ఎక్కువ భాగం గడిపిన వేదిక - వాంఖడేలో లభించిన ఆనందం త‌న కెరీర్ ను ప‌రిపూర్ణం చేసింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

ఈ మెగా టోర్నీలో యువరాజ్ సింగ్ హీరోయిజం కూడా గుర్తుండిపోతుంది. క్యాన్సర్ తో పోరాడుతూ టోర్నమెంట్ ఆడాడు.. సూప‌ర్ ఇన్నింగ్స్ ల‌తో స్టార్ గా  ఎదిగాడు. ఈ ప్ర‌పంచ క‌ప్ లో భార‌త్ ఖ‌చ్చిత‌మైన ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించింది. కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయి టై అయింది. 2011 ఫిబ్రవరి 19న బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ విజయంతో టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంఎస్ ధోనీ సేన.. వీరేంద్ర సెహ్వాగ్ తన బ్యాటింగ్ ప్రతిభను అందరికీ గుర్తు చేయగా, యువ ఆటగాడు విరాట్ కోహ్లీ తన స్టార్ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుంద‌నేది తెలియ‌జేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 274/6 ప‌రుగులు చేసింది. జ‌య‌వ‌ర్ధ‌నే సెంచ‌రీ (103) కొట్టాడు.

పిల్ల‌బ‌చ్చాగాడు... హార్దిక్ పాండ్యాను తొల‌గించండి.. ముంబై ఫ్యాన్స్ ఫైర్ !

భార‌త్ 4  వికెట్లు కోల్పోయి 48.2 ఓవ‌ర్ల‌లోనే టార్గెట్ ను ఛేదించి ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది. గౌత‌మ్ గంభీర్ 97 ప‌రుగులతో కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌గా, కెప్టెన్ ధోని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లో మ్యాచ్ ను ముగించాడు. 91 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో ధోని 2 సిక్స‌ర్లు, 8 ఫోర్లు బాదాడు. ప్రపంచ కప్ 2011 ప్రపంచ కప్ చరిత్రలో మొదటిసారిగా రెండు ఆసియా జట్లు ఫైనల్‌లో కనిపించడం.. భార‌త్ కొత్త ఛాంపియ‌న్ గా నిలిచి చ‌రిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో సూప‌ర్ ఫినిషింగ్ ఇచ్చిన ధోని ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ సిరీస్ మొత్తంగా ఆల్ రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన యూవ‌రాజ్ సింగ్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అప్ప‌టి క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంటూ వేడుక‌లు చేసుకుంటున్నారు.. 

రోహిత్ శ‌ర్మ‌ను భ‌య‌పెట్టేశాడు.. వీడియో

 

 

టీ20 క్రికెట్ లో ధోని స‌రికొత్త రికార్డు.. ఒకేఒక్క ప్లేయ‌ర్ గా ఘ‌న‌త‌ 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios