MI vs RR : వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ బౌల‌ర్ల దెబ్బ‌కు ముంబై ఇండియ‌న్స్ 125 పరుగులకే కుప్ప‌కూలింది. అయితే, మ్యాచ్ జ‌రుగుతుండ‌గా, ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని గ్రౌండ్ లోకి వెళ్లి రోహిత్ శ‌ర్మ‌ను భ‌య‌పెట్టాడు.  

Mumbai Indians Vs Rajasthan Royals : ఐపీఎల్ 2024 14వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్-రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌రో విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల తేడాతో ముంబైని చిత్తుచేసింది. అయితే, ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌ను ఒక అభిమాని భ‌య‌పెట్టాడు. దీనికి సంబంధించి వీడియో దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

రాజస్థాన్ తో జరిగిన ఐపీఎల్ 2024 హోమ్ మ్యాచ్ లో రోహిత్ శర్మను కౌగిలించుకోవడానికి వాంఖడే స్టేడియంలో ఒక అభిమాని సెక్యూరిటీని బ్రేక్ చేసి గ్రౌండ్ లోకి ప‌రుగెత్తాడు. రోహిత్ శ‌ర్మ వైపు పరిగెత్తి వెనుక నుంచి స‌డెన్ గా రావ‌డంతో ఉలిక్కిప‌డి భ‌య‌ప‌డ్డాడు. ఇదే స‌మ‌యంలో రోహిత్ శర్మ వైపు అభిమాని ఒక్క‌సారిగా రావ‌డంతో ఆశ్చర్యానికి గురిచేసింది. భద్రతా సిబ్బంది నుంచి తప్పించుకుని మైదానం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ అభిమాని రోహిత్ శ‌ర్మ‌ను, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లను హ‌గ్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత భద్రతా సిబ్బంది పట్టుకుని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

టీ20 క్రికెట్ లో ధోని స‌రికొత్త రికార్డు.. ఒకేఒక్క ప్లేయ‌ర్ గా ఘ‌న‌త‌

వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించిన ఈ అభిమాని రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ల‌ను హ‌గ్ చేసుకునీ, కొద్దిగా ముచ్చటించిన తర్వాత గాల్లోకి చేతులు ఊపుతూ గ్రౌండ్ లో సంబరాలు చేసుకోవడం మొద‌లుపెట్టాడు. పవర్ ప్లే సమయంలో అభిమాని గ్రౌండ్ లోకి దూసుకురావ‌డంతో రాజస్థాన్ ఛేజింగ్ సమయంలో ఆటకు కొన్ని నిమిషాలు బ్రేక్ పడింది.

Scroll to load tweet…

గ్రౌండ్ లోకి క్రికెట్ ప్రియులు దూకడం ఈ సీజ‌న్ లో రెండో ఘ‌ట‌న‌. అంత‌కుముందు గత వారం బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో పంజాబ్ తో జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్ లో విరాట్ కోహ్లీని కలవడానికి, పలకరించడానికి ఒక అభిమాని సెక్యూరిటీ నుంచి తప్పించుకుని మైదానంలోకి దూకాడు.

Scroll to load tweet…

అరేయ్ ఏంట్రా ఇది.. ఇలా చేస్తున్నారు.. ! మీకేమైంది..