DC vs CSK : ఐపీఎల్ 2024 13వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓడినప్పటికీ ధోని తన ధనాధన్ ఇన్నింగ్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అలాగే, టీ20 క్రికెట్ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నాడు.
Chennai Super Kings vs Delhi Capitals : ఐపీఎల్ 202413వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. వైజాగ్ లోని డాక్టర్ వైఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చిత్తుచేసింది. అయితే, ఈ మ్యాచ్ లో టీ20 చరిత్రలో తొలి వికెట్ కీపర్‌గా గొప్ప రికార్డు సృష్టించాడు స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని. ఢిల్లీ బ్యాటింగ్ చేసినప్పుడు ఆ జట్టు ప్లేయర్ పృథ్వీ షా కొట్టిన బంతిని ఎం.ఎస్. ధోనీ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో వికెట్‌కీపర్‌గా 300 వికెట్లు (క్యాచులు) తీసిన తొలి ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డు సృష్టించాడు.
టీ20 క్రికెట్ లో అత్యధిక క్యాచులను అందుకున్న ప్లేయర్లు వీరే..
1. ఎంఎస్ ధోని - 300 వికెట్లు
2. కమ్రాన్ అక్మల్ - 274 వికెట్లు
3. దినేష్ కార్తీక్ - 274 వికెట్లు
4. క్వింటన్ డీ కాక్ - 270 వికెట్లు
5. బట్లర్ - 209 వికెట్లు
GT VS SRH: గుజరాత్ కు విజయాన్ని అందించి ధోనీ క్లబ్‌లో చేరిన డేవిడ్ మిల్లర్
ధోని తన టీ20 కెరీర్‌లో 300 క్యాచులతో చరిత్ర సృష్టించాడు. ఇందులో 213 క్యాచులు, 87 స్టంపింగ్ లు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వికెట్‌కీపర్‌గా ధోని తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో పృథ్వీ షా క్యాచ్ పట్టడం ద్వారా ధోని ఈ మైలురాయిని చేరుకున్నాడు.
