పిల్లబచ్చాగాడు... హార్దిక్ పాండ్యాను తొలగించండి.. ముంబై ఫ్యాన్స్ ఫైర్ !
Hardik Pandya : ముంబై ఇండియన్స్ వరుస ఓటములపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నెట్టింట హార్దిక్ పై విమర్శలు, ట్రోల్స్, మీమ్స్ తో విరుచుకుపడుతున్నారు.
Mumbai Indians - Hardik Pandya : ఐపీఎల్ 2024 14వ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని అందుకుంది. 6 వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది. హర్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై జట్టు వరుసగా మూడో మ్యాచ్ లోనూ ఓటమిపాలైంది. దీంతో హార్దిక్ ప్యాండ్యాను టార్గెట్ చేయడం మరింత పెరిగింది. సోషల్ మీడియాలో క్రికెట్ లవర్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఐపీఎల్ 2024 ముందు నుంచి ముంబై ఇండియన్స్‌లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ జట్టుకు చేటు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఐదు సార్లు ముంబైని ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించారు. ఆ సమయంలోనూ ముంబై ఫ్యాన్స్ ఫ్రాంఛైజీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టోర్నీ ఆరంభం అయిన తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు అభిమానుల ప్రధాన టార్గెట్ గా హార్దిక్ పాండ్యా మారాడు. హార్దిక్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని ముంబై ఇండియన్స్ అభిమానులు డిమాండ్ చేస్తున్న పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెప్టెన్సీని విషయంలో హార్దిక్ సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని పలువురు సీనియర్ ప్లేయర్లు సైతం విమర్శలు గుప్పించారు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2024లో చాలా చెత్త సీజన్‌ను ప్రారంభించింది. ఆ జట్టు ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా గెలవలేక సున్నా పాయింట్లతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్ నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులు మాత్రమే చేయడంతో ఇప్పటివరకు ఈ సీజన్ లో తక్కువ స్కోర్ చేసిన జట్టుగా ముంబై చెత్త రికార్డును నమోదుచేసింది.
సోషల్ మీడియాలో అయితే, హార్దిక్ పాండ్యాను ఒక రేంజీలో ట్రోల్స్ తో ఆటాడుకుంటున్నారు. తీవ్రంగా స్పందిస్తూ విమర్శల దాడి చేస్తున్నారు. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ నుంచి హార్దిక్ పాండ్యా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ సమయంలో అతనిపై ట్రోల్స్ వెల్లువెత్తాయి. అలాగే, మ్యాచ్ సమయంలో స్టేడియంలో ఉన్న అభిమానులు సైతం హార్దిక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు, మూడో మ్యాచ్‌ల్లోనూ అదే జరిగింది. ఇప్పుడు రాజస్థాన్ ఓటమి తర్వాత, అభిమానులు హార్దిక్‌పై ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో హార్దిక్ ప్యాండ్యాకు వ్యతిరేకంగా చాలా పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. హార్దిక్ ప్యాండ్యా పిల్లబచ్చా అనీ, రోహిత్ శర్మకు చాలా అనుభవం ఉందని పేర్కొంటున్నారు. హార్దిక్ ను తొలగించి రోహిత్ శర్మకు ముంబై కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
IPL 2024: మరింత క్రమశిక్షణ, ధైర్యం అవసరం: పరాజయంపై హార్దిక్ పాండ్యా
రోహిత్ శర్మను భయపెట్టేశాడు.. వీడియో
- BCCI
- Cricket
- Games
- Hardik
- Hardik Pandya
- Hardik Pandya trolled
- Hit Man
- IPL
- IPL 2024
- Indian Premier League
- Indian Premier League 17th Season
- MI vs RR
- Mumbai
- Mumbai Indians
- Mumbai Indians Vs Rajasthan Royals
- Mumbai Indians captain
- Mumbai Vs Rajasthan
- Mumbai captain
- Rajasthan Royals
- Rohit Sharma
- Rohit Sharma video
- Sports
- Tata IPL
- Tata IPL 2024
- Team India