IPL 2025 LSG vs RCB: లక్నో-బెంగళూరు టీమ్ లు ఐపీఎల్ 2025లో చివరి లీగ్ మ్యాచ్‌ ను ఆడుతున్నాయి. విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది.

IPL 2025 LSG vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 చివరి లీగ్ మ్యాచ్‌ లో గెలిచి టాప్ 2లో స్థానం సంపాదించాలని ఆర్సీబీ లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీఎల్ 2025 70వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబీకి తాత్కాలిక కెప్టెన్ గా జైతేష్ శర్మ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు.

జితేష్ శర్మ మాట్లాడుతూ.. “ఇది మంచి పిచ్‌లా కనిపిస్తుంది, మేము ఛేజ్ చేయడం ఇష్టపడతాం. టాప్-2లో చోటు దక్కించుకోవడం మా ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నాడు. ఆర్సీబీ జట్టులో రాజత్ పటిదార్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ప్రకటించారు. టిమ్ డేవిడ్‌కు బదులుగా లియామ్ లివింగ్‌స్టోన్, లుంగీ ఎంగిడీకి బదులుగా నువాన్ తుషారా జట్టులోకి వచ్చారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రాజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (కెప్టెన్/వికెట్ కీపర్), రోమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, నువాన్ తుషారా.

ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిస్తే లీగ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నుంచి టాప్-2 లోకి చేరుకుంటుంది. భారీ విజయాన్ని సాధిస్తే మొదటి స్థానంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో రెండు ప్రధాన రికార్డులు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు.

LSG ఇప్పటికే టైటిల్ రేసు నుంచి అవుట్ అయింది. చివరి మ్యాచ్ లో గెలిచి గౌరవంగా ఐపీఎల్ 2025 సీజన్ ను ముగించాలని చూస్తోంది. రిషభ్ పంత్ మాట్లాడుతూ, “మేము బ్యాటింగ్ లేదా బౌలింగ్ ఏదైనా చేయడానికి సిద్ధమే. గత మ్యాచ్‌లో మా సామర్థ్యాన్ని చూపించగలిగాం. ప్రతి మ్యాచ్ ను కొత్తగా నేర్చుకునే అవకాశంగా చూస్తాం. చివరి బంతి వరకు 100 శాతం ఇస్తాం” అని చెప్పారు.

లక్నో సూపర్ జెయింట్స్ జట్టు

మిచెల్ మార్ష్, మాథ్యూ బ్రెట్జ్కే, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), ఆయుష్ బదోని, అబ్దుల్ సమాద్, హిమ్మత్ సింగ్, షాబాజ్ అహ్మద్, దిగ్వేశ్ సింగ్ రాథి, ఆవేశ్ ఖాన్, విలియమ్ ఓ’రూర్కే.

పిచ్ నివేదిక:

డీప్ దాస్‌గుప్తా, మాథ్యూ హేడెన్ ప్రకారం, పిచ్ మిశ్రమ స్వభావం కలిగి వుంటుంది. అంటే బ్యాటర్లు, బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఒరిస్సా బ్లాక్, ముంబై రెడ్ మట్టి కలిపి ఉంటుంది. స్పిన్నర్లు, కటర్లతో ఫాస్ట్ బౌలర్లు విజయవంతం కావచ్చని అంచనా. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2025 లీగ్ దశ ముగియనుంది.