Asianet News TeluguAsianet News Telugu

టెస్టుల్లో భారత పేస్ ఎటాకే నెంబర్ 1!

భారత జట్టు బ్యాటింగ్ తోపాటు భారత బౌలింగ్ విభాగం కూడా అత్యంత పటిష్టంగా ఉంది. భారత పేస్, స్పిన్నర్లు అద్భుత ఆటతీరుతో అన్ని టీంలకు చుక్కలు చూపిస్తున్నారు. అతి తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్ చేస్తూ... భారత టీం కి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. 

Indian test pace attack is the best in the world says dale steyn
Author
Hyderabad, First Published Dec 22, 2019, 11:53 AM IST

అంతర్జాతీయ క్రికెట్లో భారత కీర్తిపతాకం ప్రస్తుతానికి రెపరెపలాడుతోంది. భారత టీం అంటేనే అవతలి టీంలు భయపడే స్థాయికి వెళ్లారు. టీం ఇండియా పేరు చెబితే ఇంతకుముందు వరకు భారత బ్యాటింగ్ విభాగం మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. 

భారత జట్టు బ్యాటింగ్ తోపాటు భారత బౌలింగ్ విభాగం కూడా అత్యంత పటిష్టంగా ఉంది. భారత పేస్, స్పిన్నర్లు అద్భుత ఆటతీరుతో అన్ని టీంలకు చుక్కలు చూపిస్తున్నారు. అతి తక్కువ స్కోర్లను కూడా డిఫెండ్ చేస్తూ... భారత టీం కి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు. 

ఇక మొన్న జరిగిన ఐపీఎల్ వేలంలో ఆర్సీబీ జట్టు భారీ మొత్తానికి సఫారీ పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ ని కొనుగోలు చేసింది. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో కొద్దిసేపు ముచ్చటించారు. ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. 

Also read: IPL Auction 2020: చెన్నై రసగుల్లా వ్యాఖ్య, కేకేఆర్ తమిళ ప్రశ్న

ప్రపంచ క్రికెట్‌లో టీమ్‌ ఇండియా పేస్‌ దళమే టెస్టుల్లో అత్యుత్తమని దక్షిణాఫ్రికా దిగ్గజ సీమర్‌ డెల్‌ స్టెయిన్‌ అభిప్రాయపడ్డాడు. గురువారం జరిగిన ఐపీఎల్‌2020 వేలంలో డెల్‌ స్టెయిన్‌ను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ ప్రాంఛైజీ తీసుకుంది. 

ఈ సందర్భంగా ట్విటర్‌లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్టెయిన్‌ సమాధానం ఇచ్చాడు. 'గత రెండు సంవత్సరాలుగా జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, ఉమేశ్‌ యాదవ్‌లతో కూడిన భారత పేస్‌ దళం అత్యద్భుతంగా రాణిస్తోంది' అని అన్నాడు. 

'బౌలర్ల ప్రదర్శనతో టీమ్‌ ఇండియా టెస్టుల్లో వరల్డ్‌ నం.1గా కొనసాగుతోంది' అని స్టెయిన్‌ అన్నాడు. అభిమాన బ్యాట్స్‌మెన్‌గా క్వింటన్‌ డికాక్‌, ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలను స్టెయిన్‌ ఎంచుకున్నాడు. ఆటగాళ్ల వేలంలో తొలి రెండు రౌండ్లలో స్టెయిన్‌ను తీసుకునేందుకు ప్రాంఛైజీలు మొగ్గుచూపలేదు. ర్యాపిడ్‌ రౌండ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. 

ఇక మొన్నటి ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది. ఐపీఎల్‌ ప్రాంఛైజీలు కురిపించిన కాసుల వర్షంలో విదేశీ క్రికెటర్లు తడిసి ముద్దయ్యారు!. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాట్‌ కమిన్స్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, అరోన్‌ ఫించ్‌, క్రిస్‌ లిన్‌, అలెక్స్‌ క్యారె, నాథన్‌ కౌల్టర్‌నైల్‌, మిచెల్‌ మార్ష్‌లు 2020 ఐపీఎల్‌ ఆటగాళ్లలో గరిష్ట ధరను సొంతం చేసుకున్నారు. 

Also read: IPL 2020: ఆ జట్టు బలం అతనే.. అన్ని సమస్యలకు ఆయనే పరిష్కారం

ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ఇయాన్‌ మోర్గాన్‌, క్రిస్‌ వోక్స్‌, జసన్‌ రారు, శామ్‌ కరణ్‌లు సైతం కోటీశ్వరుల జాబితాలో చేరిపోయారు. 73 స్థానాల కోసం జరిగిన 2020 మినీ ఆటగాళ్ల వేలంలో దేశవాళీ క్రికెటర్లపై ప్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. యువ క్రికెటర్లను తీసుకునేందుకు కొన్ని ప్రాంఛైజీలు మొగ్గుచూపినా.. దక్కించుకునేందుకు పోటీ కనిపించలేదు.

ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. రూ. 15.5 కోట్ల వెచ్చించి కోల్‌కత నైట్‌రైడర్స్‌ కమిన్స్‌ను దక్కించుకుంది. డ్యాషింగ్‌ ప్లేయర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ కోసం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ రూ. 10.75 కోట్లు, క్రిస్‌ మోరిస్‌ కోసం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ రూ. పది కోట్లు ఖర్చు చేసింది. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆటగాళ్ల వేలంలో ఇండియన్‌ క్రికెటర్లపై  ప్రాంఛైజీలు అధిక ఆసక్తి చూపలేదు. మరో ఏడాదిలో మెగా వేలానికి వెళ్లనున్న ప్రాంఛైజీలు కోల్‌కత మినీ వేలంలో జట్టులో సర్దుబాటు స్థానాలపైనే దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios