చెన్నై: కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ హ్యాండిల్స్ మధ్య ఆహారపు రుచుల పరస్పర వ్యాఖ్యల వ్యవహారం నడుస్తోంది. కోల్ కత్తాలో గురువారం ఆటగాళ్ల వేలం పాటలు సందర్భంగా ఆ వ్యవహారం ప్రారంభమైంది. 

తొమ్మిది మంది కొత్త ఆటగాళ్లను జట్టులో చేర్చుకున్న కేకేఆర్ చాలా చురుగ్గా ఉంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ను అత్యధిక ధర పెట్టి కొనుగోలు చేసింది. చెన్నై సూపర్ కింగ్రస్ నలుగురిని మాత్రమే కొనుగోలు చేసింది. 

 

పియూష్ చావ్లా, సామ్ కర్రాన్ లను భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. తమ జట్టు సభ్యుడు రసగుల్లాను తింటున్న పిక్చర్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ సభ్యుడెవరనేది తెలియకుండా ఆ పోస్టు పెట్టింది. 

దానిపై కేకేఆర్ తమిళంలో ప్రశ్నను విసిరింది. అది బాగుందా అంటూ ఆ ప్రశ్న వేసింది. దానికి చెన్నై సూపర్ కింగ్స్ కూడా తమిళంలో జవాబిచ్చింది. ఈ పరస్పర సంభాషణలను కేకేఆర్, సిఎస్కే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.