ముందున్న ఆటగాళ్లు : అంబటి రాయుడు, కెఎం అసిఫ్‌, దీపక్‌ చాహర్‌, డ్వేన్‌ బ్రావో, డుప్లెసిస్‌, హర్బజన్‌ సింగ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, ఎన్‌ జగదీశన్‌, కరణ్‌ శర్మ, కేదార్‌ జాదవ్‌, లుంగి ఎంగిడి, మిచెల్‌ శాంట్నర్‌, మోను సింగ్‌, ఎం.ఎస్‌ ధోని, మురళీ విజరు, రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, షేన్‌ వాట్సన్‌, షార్దుల్‌ ఠాకూర్‌, సురేశ్‌ రైనా.

వేలంలో తీసుకున్న ఆటగాళ్లు : శామ్‌ కరణ్‌, పియూశ్‌ చావ్లా, జోశ్‌ హెజిల్‌వుడ్‌, ఆర్‌ సాయి కిశోర్‌.


చెన్నై సూపర్ కింగ్స్ నూతన స్క్వాడ్:


నారాయణ్ జగదీసన్, రుతురాజ్ గైక్వాడ్, కెఎమ్ ఆసిఫ్, రవీంద్ర జడేజా, ఎం విజయ్, ఎంఎస్ ధోని, జోష్ హజిల్‌వుడ్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్, కర్న్ శర్మ, పియూష్ చావ్లా, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇఫ్రాన్ తాహిర్ ఠాకూర్, మిచెల్ సాంట్నర్, డ్వేన్ బ్రావో, లుంగీ ఎన్గిడి, సామ్ కుర్రాన్, మోను కుమార్, షేన్ వాట్సన్, సాయి కిషోర్

ప్లేయింగ్ ఎలెవన్ అంచనా : షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా, రాయుడు, ధోని, జాదవ్‌, జడేజా, బ్రావో/కరణ్‌, చాహర్‌, చావ్లా, ఎంగిడి/హెజిల్‌వుడ్‌.

జట్టు ఎలా ఉంది? : వేలంలో కోరుకున్న ఆటగాళ్లను సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసింది. చెపాక్‌ పిచ్‌పై శామ్‌ కరణ్‌, హెజిల్‌వుడ్‌ తెలివైన ఎంపిక. పియూశ్‌ చావ్లాకు అధిక ధర పెట్టారనే వాదన వినిపిస్తున్నా ఇమ్రాన్‌ తాహీర్‌కు తోడుగా పనికొస్తాడనే భావన చెన్నైది. కాకపోతే జట్టులో లెఫ్ట్ హ్యాండ్ పేసర్‌ లేని లోటు మాత్రం కనపడుతుంది.   

Also Read:జాక్ పాట్ కొట్టేసిన భారత కుర్రాళ్ళు వీరే!

ఇక చెన్నై టీం ని చూస్తే మనకు కనపడే మరో అంశం ఆటగాళ్ల వయసు. ధోని, రైనా, రాయుడు,వాట్సన్ వీరంతా వరల్డ్ క్లాస్ క్రికెటర్లు. వయసు వీరికి అడ్డంకి కాకపోవచ్చు...కానీ ఈ ప్లేయర్స్ గత సంవత్సర కాలంగా పెద్దగా క్రికెట్ ఆడింది లేదు. ఒకింత దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారు ఎలా ఆడతారో చూడాలి. అంతే కాకుండా ఆ జట్టు కీలక బ్యాట్స్ మెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. 


వయసైపోయిన జట్టుగా మనకు కనపడుతున్నప్పటికీ కూడా చెన్నై జట్టుకి ఏదన్నా మ్యాజిక్ ఉంది అంటే అది ఖచ్చితంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. టీం మొత్తం జాయింట్ గా ఉండడానికి తోడ్పడేది అతని నాయకత్వం. అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారంగా ధోనిని భావిస్తుంది చెన్నై జట్టు. 


ఇక చెన్నై టీం కి ఉన్న మరో బలం ఏదన్నా ఉందంటే వారి ఫ్యాన్ బేస్. ఆ ఫ్యాన్స్ ఎంత హార్డ్ కోర్ అభిమానులంటే టీం తో పాటుగా ట్రావెల్ చేసేవారు అనేకం. ఇక ఏ నగరంలో జరిగినా చెన్నైతో మ్యాచ్ అంటే చాలు స్టేడియం కిక్కిరిసిపోవాలిసిందే. 


ఇంకో రెండు నెలల తరువాత ఈ మెగా ఈవెంట్ ఆరంభమవనుంది. సో ఫాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ఆక్టివ్ అయిపోయారు. విజిల్ పోడు అంటూ సంగ్రామం కోసం ఎదురుచూస్తున్నారు.