కరోనా ఎఫెక్ట్: భారత్, దక్షిణాఫ్రికా సిరీస్ రద్దు

కరోనా వైరస్ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సి ఉన్న రెండు మ్యాచులను కూడా బీసీసీఐ రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో, మిగిలిన రెండు మ్యాచులను కూడా రద్దు చేసారు. 

India vs South Africa: Lucknow, Kolkata ODIs cancelled amid coronavirus threat - Reports

కరోనా వైరస్ దెబ్బకు భారత క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడా మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించొద్దని మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ దెబ్బకు ఐపీఎల్ నిర్వాహకులు సైతం ఐపీఎల్ ను రెండు వారాలపాటు వాయిదా వేయాలని కోరగా బీసీసీఐ అందుకు అంగీకరించి ప్రకటన విడుదల చేసింది. 

ఈ కరోనా వైరస్ నేపథ్యంలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరగాల్సి ఉన్న రెండు మ్యాచులను కూడా బీసీసీఐ రద్దు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో, మిగిలిన రెండు మ్యాచులను కూడా రద్దు చేసారు. 

ధర్మశాలలో నిన్న జరగాల్సి ఉన్న మ్యాచు వర్షం కారణంగా టాస్ కూడా వేయకుండానే రాధాయింది. రెండవ మ్యాచ్ లక్నోలో జరగాల్సి ఉండగా, ఆఖరు మూడవ మ్యాచు కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరగాల్సి ఉంది. 

Also read: కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!

కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఐపీఎల్ నే పోస్టుపోన్ చేశామని, కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధికారులు ఒకరు అన్నారు. 

ఇక నిన్న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 2019 సెప్టెంబర్‌లో భారత్‌, దక్షిణాఫ్రికాలు టీ20 మ్యాచ్‌కు వచ్చినప్పుడు.. ఆడనివ్వకుండా పంపించిన వరుణుడు తాజాగా నిన్నటి వన్డే మ్యాచ్‌కూ అదే చేశాడు. 

భారీ వర్ష సూచన కలిగిన తొలి వన్డే కనీసం టాస్‌ సైతం వేయకుండానే రద్దు అయ్యింది. ధర్మశాల వన్డే రద్దుతో భారత్‌, దక్షిణాఫ్రికాలు మిగతా రెండు వన్డేల్లో సిరీస్‌ కోసం పోరాడతాయని అందరూ ఊహించినా అది కలగానే మిగిలిపోయింది. 

Also read: కరోనా దెబ్బ: అంతర్జాతీయ క్రికెట్లో గల్లీ క్రికెట్ రూల్స్ కు వేళాయెరా!

ఆరు నెలల క్రితం భారత పర్యటనలో టీ20 సిరీస్‌ సమం చేసుకుని, టెస్టు సిరీస్‌ను 0-3తో కోల్పోయిన దక్షిణాఫ్రికా ఇప్పుడు సరికొత్త సమీకరణాలు, యువ నాయకత్వంతో ఉపఖండంలో కాలుమోపింది. అయినప్పటికీ ఒక్క మ్యాచు కూడా ఆడకుండానే తిరిగి వెళ్లిపోవాలిసి వస్తుంది. 

ఇక నిన్నటి మ్యాచులో షెడ్యూల్‌ ప్రకారం మధ్యహ్నాం 1 గంటలకు టాస్‌ వేయాలి. వర్షం లేకపోయినా, అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటంతో టాస్‌ ఆలస్యమైంది. ఇక మ్యాచ్‌ ఆరంభం లాంఛనమే అనుకున్న సమయంలో వరుణుడు వచ్చేశాడు. సుమారు నాలుగు గంటలు (3 గంటల 50 నిమిషాలు) ఎదురుచూపుల తర్వాత తొలి వన్డేను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios