Asianet News TeluguAsianet News Telugu

కరోనా దెబ్బ: ఐపీఎల్ వాయిదా...కొత్త ఆరంభ తేదీ ఇదే!

కరోనా వైరస్ వల్ల మ్యాచులను ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తే భారీ నష్టాలూ తప్పవు. అందుకోసమని మరొక 15 రోజులపాటు గనుక ఐపీఎల్ షెడ్యూల్ ని పోస్ట్ పోనే చేస్తే బాగుండని వారు భావిస్తున్నారు. దానికి బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం.

Corona Effect: IPL 2020 postoponed... Likely to begin in mid April
Author
Mumbai, First Published Mar 13, 2020, 2:53 PM IST

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం వణికిపోతుంది. జనాలు బయట తిరగాలంటేనే జంకుతున్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ... భారత ప్రభుత్వం కూడా ఈ మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని చర్యలను తీసుకుంటుంది. 

తాజాగా నిన్న సాయంత్రం క్రీడా మంత్రిత్వ శాఖ క్రీడల నిర్వహణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఏ క్రీడను వీక్షినడానికి కూడా ప్రజలు భారీ ఎత్తున గుమికూడదని ఆదేశించారు. నిర్వహించాల్సి వస్తే... క్లోస్డ్ డోర్స్ లో మాత్రమే నిర్వహించాలని చెప్పింది. 

కరోనా వైరస్ వల్ల మ్యాచులను ఖాళీ స్టేడియంలలో నిర్వహిస్తే భారీ నష్టాలూ తప్పవు. అందుకోసమని మరొక 15 రోజులపాటు గనుక ఐపీఎల్ షెడ్యూల్ ని పోస్ట్ పోనే చేస్తే బాగుండని వారు భావిస్తున్నారు. దానికి బీసీసీఐ సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపినట్టు సమాచారం. 

వాస్తవానికి ఈ నెల 29 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా బీసీసీఐ ని అన్ని ఫ్రాంచైజీలు ఒక రెండు వారాలపాటు వాయిదా వేయమని కోరాయి. వెంటనే స్పందించిన బీసీసీఐ అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న బీసీసీఐ వాయిదా వేసింది. 

బీసీసీఐ లోని సభ్యులు సూత్రప్రాయ అంగీకారం తీసుకోగానే... మరింత ఆలస్యం చేయకూడదని భావించిన బోర్డు వెంటనే అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. 

ఇలా ఏప్రిల్ 15వ తేదీవరకు ముందుకు జరిపితే.... అప్పుడు బీసీసీఐ మరోసారి పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. 

ఇకపోతే చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణను తాము అనుభవించామని చెప్పాయి. మహారాష్ట్ర సర్కార్ తాము ఇలా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడలేమని వారు తెలిపారు. 

తాజాగా ఢిల్లీ సర్కార్ కూడా ఇదే విధంగా స్పందించింది. రాష్ట్రప్రభుత్వాలు కోర్టుకు కూడా ఎక్కాయి. అందుకోసమని కొన్ని రోజులపాటు వాయిదా వేస్తే. అప్పుడు వారికి పరిస్థితులను మరో మారు సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios