ధర్మశాలలో నేడు భారత్, దక్షిణాఫ్రికాతో తొలి వన్డేను ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వెదర్ రిపోర్టులో అక్కడ వర్షంపడే సూచనలు ఉన్నాయని చెప్పిన విషయం తెలిసిందే. 

ధర్మశాల వన్డే కు వర్షం ముప్పు ఉండదు అని తొలుత చెప్పిన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, గతంలో ఎందుకు మ్యాచ్ వర్షార్పణమయిందో చెప్పడానికి ఒక ఫన్నీ సాకును వెతుక్కున్నారు. 

వాతావరణ శాఖ వారు ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ వరుణుడు ఉరిమాడు. ప్రస్తుతానికి టాస్ కూడా ఆలస్యమయింది. స్టేడియం అంతా కూడా భారీ కవర్లతో కప్పేశారు. ఆకాశం మేఘావృతమై భారీ వర్షం పడే సూచనలే కనబడుతున్నాయి. 

Also read: ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి వన్డే: కివీస్ గాయం నుంచి బయటపడేనా...?

ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం అధికారులు స్థానిక ఆలయంలో ఇక్కడి దుష్ట శక్తులు అన్నిటిని పారద్రోలడానికి పూజలు నిర్వహించినట్టు చెప్పారు. తద్వారా వర్షం నేటి మ్యాచుకు అంతరాయం కలిగించదు అనేది వారి ఉద్దేశం. 

వెంటనే అక్కడే ఉన్న సదరు పాత్రికేయుడు ఇక్కడ గతంలో భారత్, సౌతాఫ్రికాల మధ్య రద్దైన మంచు గురించి ప్రశ్నించగా... పూజారుల మీదికి నెపం తోసేస్తూ ... వారు పూజలు సరిగా చేయలేదులెండి అని సమాధానమిచ్చారు. అధికారుల దగ్గరినుండి ఈ సమాధానం రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ ఫక్కున నవ్వారు. 

ఆస్ట్రేలియాను 3-0తో స్వదేశంలో క్లీన్‌స్వీప్‌ చేసిన ఉత్సాహంలో దక్షిణాఫ్రికా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. న్యూజిలాండ్‌ చేతిలో 0-3తో వైట్‌వాష్‌కు గురైన భారత్‌ తిరిగి గెలుపు బాట పట్టాలని ఆరాటపడుతోంది. 

ధర్మశాల వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సవాల్‌ను షురూ చేసేందుకు సిద్ధమవుతుండగా.. వరుణుడు మాత్రం కాచుకొని కూచున్నాడు.  గతేడాది ఈ రెండు జట్ల టీ20 మ్యాచ్‌ కు ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన వరుణుడు అప్పుడు ఇరు జట్లను మ్యాచ్ ఆడనివ్వలేదు. 

ఇప్పుడు వన్డేకు సైతం ప్రత్యేక ఆహ్వానితుడిగా ఎక్కడ వస్తాడో అని ఇరు జట్ల క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా భయపడిపోతున్నారు. వరుణ దేవుడు సహకరిస్తే నేడు ధర్మశాలలో భారత్‌, దక్షిణాఫ్రికా ల మధ్య జరిగే తొలి పోరు ధ్వారా ఈ సిరీస్ మొదలవుతుంది. 

న్యూజిలాండ్ టూర్ కి ముందు గనుక భారత్ గురించి మాట్లాడుకుంటే... ఒక అద్వీతీయమైన జట్టుగా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే జట్టుగా అందరూ చెప్పుకునే వారు. వరల్డ్ కప్ లో సఫారీల పేలవ ప్రదర్శన చూసిన వారు భారత్ తో సిరీస్ అంటే... చాలా తేలికగా భారత్ దే సిరీస్ అని అనేవారు. 

Also read; క్రికెట్ పై కరోనా ఎఫెక్ట్...ఇక ఏ బౌలర్ అలా చేయడంటున్న భువీ

కానీ పరిస్థితులు మారిపోయాయి. దక్షిణాఫ్రికా ఇప్పుడు బౌచర్ శిక్షణలో రాటు దేలింది. భారత్ జట్టులోని లోపాలు న్యూజిలాండ్ పర్యటనలో బయటపడ్డాయి. ఇప్పుడు ఈ సమరం విషయానికి వచ్చేసరికి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య పోరు ఏకపక్షంగా ఉండబోదనే విషయం మాత్రం అర్థమైపోతుంది. 

ఐపీఎల్‌ 13కు ముందు ఈ మూడు వన్డేల సిరీస్‌ భారత్‌ ఆటగాళ్లకు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది.  జట్టుతో కొత్తగా చేరిన ఆటగాళ్లు, జట్టుతో ఉన్న ఆటగాళ్లు ఫామ్‌ చాటుకుని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు ఉత్సాహంగా సిద్ధమవ్వాలని అనుకుంటున్నారు. 

ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్, టి 20న వరల్డ్ కప్ ల నేపథ్యంలో ఈ ఏడాది భారత్‌ టెస్టులు, టీ20లకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపోటములపై కోహ్లిసేనకు కంగారు లేదు. అలాగని ఉదాసీనంగా ఆడే ఆస్కారం లేదు. న్యూజిలాండ్‌ ఓటమి గాయానికి విరుగుడుగా సఫారీపై వన్డే సిరీస్‌ను సాధించటం కోహ్లిసేన తక్షణ కర్తవ్యం. 

స్వదేశంలో వరుసగా టెస్టు సిరీస్‌లు ఓడిన దక్షిణాఫ్రికా వన్డేల్లో మాత్రం మెప్పించింది. నిరుడు భారత్‌తో టీ20 సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న దక్షిణాఫ్రికా నేడు వన్డే సిరీస్‌పైనా ఆశలు పెట్టుకుంది. కరోనా వైరస్‌ భయపెడుతున్నా భారత్‌, దక్షిణాఫ్రికాలు నేడు ధర్మశాలలో వన్డే పోరుకు సై అంటున్నాయి.