ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న పేరు కరోనా వైరస్. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా... ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్.. క్రికెట్ పై కూడా పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ చేసిన కామెంట్సే సాక్ష్యం.

Also Read దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు మాస్క్‌తో చాహల్, అభిమానుల ఆందోళన...

ఇంతకీ మ్యాటరేంటంటే... గురువారం దక్షిణాఫ్రికాతో జరిగే తొలి వన్డే మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. కరోనా ఎఫెక్ట్ తో  బంతిపై లాలాజలం (ఉమ్ము)ను ఎక్కువగా ఉపయోగించం అని టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. కరోనా భయంతో ఇక ఏ బౌలర్ అలా చేయడు అని ఆయన పేర్కొనడం విశేషంం. సాధారణంగా బంతి స్వింగ్ అవ్వడానికి, పట్టు చిక్కాడానికి బౌలర్లు లాలాజలంను ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే.

ఈ కరోనా వైరస్ తుమ్ములు, దగ్గులు, జలుబు, లాలాజలం, కరచాలం తో కూడా ఒకరి నుంచి ఒకరికి పాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలా చేయమంటూ భువీ పేర్కొనడం విశేషం. అయితే... అలా చేయకపోతే... మాపై అభిమానులు విమర్శలు చేస్తారంటూ ఆయన పేర్కొనడం గమనార్హం.

'మేము ఈ విషయం (లాలాజలం వాడాలా వద్దా)పై ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నేను లాలాజలం ఉపయోగించనని కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే లాలాజలం ఉపయోగించకపోతే బంతిని షైన్ చేయలేం. అలా చేయకపోతే మేము సరిగా రాణించలేం. అప్పుడు సరిగా బౌలింగ్ చేయలేదని అభిమానులు మాపై విమర్శలు చేస్తారు' అని అన్నాడు.

ఈ విషయంపై తాము మీటింగ్ లో చర్చించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. తమ టీం డాక్టర్ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని వివరించాడు. ఇదిలా ఉండగా... ఇప్పుడు ఈ కరోనా దెబ్బ ఐపీఎల్ మీద కూడా పడే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ రద్దు చేయాలంటూ చాలా మంది కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.