India vs England : భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా సెంచరీ కొట్టాడు. దీంతో భారత్ తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ లో 300 మార్క్ ను దాటింది.
India vs England: రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్స్ అదరగొడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. ఆల్ రౌండ్ రవీంద్ర జడేజా సైతం సెంచరీ కొట్టాడు. వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన క్రమంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా నిలకడగా ఆడుతూ సెంచరీ కొట్టాడు. రోహిత్ శర్మతో కలిసి భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి భారత్ స్కోర్ ను 300 మార్క్ ను దాటించాడు. రవీంద్ర జడేజాకు ఇది 4వ టెస్టు సెంచరీ.
అయితే, 90లోకి వచ్చిన తర్వాత రవీంద్ర జడేజా కాస్తా నెమ్మదించాడు. సెంచరీకి చేరుకోవడానికి చాలా బంతులు తీసుకున్నాడు. 99 పరుగుల వద్ద దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ను రన్ కు కాల్ ఇచ్చి రాకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ గా వెనుదిరిగాడు. దీంతో సెంచరీ కొట్టిన తర్వాత జడ్డూ భాయ్ పెద్దగా సంబరాలు చేసుకోలేదు. సర్ఫరాజ్ రనౌట్ కావడానికి కారణం అయ్యాననే నిరాశ జడేజా ముఖంలో కనిపించింది. ప్రస్తుతం జడేజా (110* పరుగులు), కుల్ దీప్ యాదవ్ (1* పరుగులు)లు క్రీజులో ఉన్నారు. భారత్ 326/5 (86 ఓవర్లు) పరుగులతో ఆడుతోంది.
INDIA VS ENGLAND: సర్ఫరాజ్ ధనాధన్ ఇన్నింగ్స్.. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీ..
అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు. రోహిత్ 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు సాధించాడు. అలాగే, ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్ లో క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారించాడు. అరంగేట్రంలోనే హాఫ్ సెంచరీతో చెలరేగాడు. అయితే, ఫుల్ జోష్ మీద ఆడుతున్న తరుణంలో దురదృష్టవశాత్తు రనౌట్ గా వెనుదిరిగాడు. సర్ఫరాజ్ 66 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
హార్దిక్ పాండ్యాకు ఝలక్.. టీ20 ప్రపంచకప్-2024 లో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ !
