India vs England: స‌ర్ఫ‌రాజ్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్.. అరంగేట్రంలోనే హాఫ్ సెంచ‌రీ..

India vs England : భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా సూపర్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు. 
 

India vs England : Sarfaraz Khan's new record of being the fastest player to score a half-century on Test cricket debut RMA

India vs England: రాజ్ కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాండ్ మూడో టెస్టులో టీమిండియా బ్యాట‌ర్స్ అద‌ర‌గొడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ సెంచ‌రీ కొట్టాడు. ఆల్ రౌండ్ ర‌వీంద్ర జ‌డేజా సైతం సెంచ‌రీకి చేరువ‌య్యాడు. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. కేవ‌లం 48 బంతుల్లోనే స‌ర్ఫ‌రాజ్ ఖాన్ సెంచ‌రీ కొట్టాడు. దీంతో భార‌త టెస్టు క్రికెట్ స‌రికొత్త రికార్డు సృష్టించాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యంత వేగంగా అర్థ సెంచ‌రీ సాధించిన భార‌త క్రికెట‌ర్ గా స‌ర్ఫ‌రాజ్ ఖాన్ చ‌రిత్ర సృష్టించాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే ఫియ‌ర్ లెస్ క్రికెట్ తో ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతున్న స‌ర్ఫ‌రాజ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. రేసు గుర్రంలా  గ్రౌండ్ లో ప‌రుగులు సాధిస్తున్నాడు.

హార్దిక్ పాండ్యాకు ఝ‌ల‌క్.. టీ20 ప్రపంచకప్‍-2024 లో భార‌త కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ !

 

దేశవాళీ క్రికెట్ లో సరికొత్త రికార్డులు

సర్ఫరాజ్ దేశ‌వాళీ క్రికెట్ లో నిలకడగా రాణించడమే కాకుండా రికార్డు బద్దలు కొట్టాడు. 2019/2020 రంజీ సీజన్‌లో, సర్ఫరాజ్ ముంబైకి స్టార్ పెర్ఫార్మర్. అప్పటి నుండి, అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 82.46 సగటుతో ఉన్నాడు. 2019-2020 సీజన్‌లో, సర్ఫరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 154.66 సగటుతో 928 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు చేశాడు. అతని సగటు 154.66 ఒక్క రంజీ సీజన్‌లో ఏ బ్యాటర్‌కైనా రెండవ అత్యధికం ఇది. 2021/2022 సీజన్‌లో సర్ఫరాజ్ మరోసారి 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. ఆ సీజన్‌లో బ్యాటింగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన సర్ఫరాజ్ నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు చేశాడు.

రెండు వరుస రంజీ సీజన్లలో 900-ప్లస్ పరుగులు చేసిన సర్ఫరాజ్ వరుసగా రెండు సీజన్లలో 900-ప్లస్ పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. దానికి తోడు, రంజీ ట్రోఫీ సీజన్‌లో రెండుసార్లు 900 పరుగుల మార్క్‌ను అధిగమించిన మూడో బ్యాటర్‌గా కూడా సర్ఫరాజ్ నిలిచాడు. 2020 నుండి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ 82.40 కంటే ఎక్కువ సగటుతో 2,000-ప్లస్ పూర్తి చేసిన మరే ఇతర బ్యాటర్ లేడే.

India vs England: 11 ఫోర్లు, 2 సిక్స‌ర్లు.. ఇంగ్లాండ్ పై సెంచరీతో క‌దం తొక్కిన రోహిత్ శ‌ర్మ‌.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios