Asianet News TeluguAsianet News Telugu

IND vs ENG: 146 kmph బౌన్స‌ర్.. సిక్సు కొట్టిన ప్లేయ‌ర్.. ధృవ్ జురెల్ తో పెట్టుకుంటే అంతే మ‌రి.. !

India vs England: భారత్ vs ఇంగ్లండ్ 3వ టెస్టులో అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ తో పాటు భార‌త యంగ్ ప్లేయ‌ర్ ధృవ్ జురెల్ లు బ్యాట్ తో స‌త్తా చాటారు. తొలి మ్యాచ్ లోనే మంచి స్కోరును సాధించారు. 
 

India vs England: Indian player Dhruv Jurel hits a six off a 146 kmph bouncer from Mark Wood RMA
Author
First Published Feb 16, 2024, 1:47 PM IST | Last Updated Feb 16, 2024, 1:47 PM IST

India vs England: రాజ్‌కోట్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్-ఇంగ్లాడ్ మూడో టెస్టులో భార‌త్ భారీ స్కోర్  సాధించింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 445  పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శ‌ర్మ, ర‌వీంద్ర జడేజాల సెంచ‌రీలు, స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచ‌రీ, తొలి ఇన్నింగ్స్ చివ‌ర‌లో ధృవ్ జురెల్ 46 ప‌రుగులు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 37 ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ స్కోరు తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది.

అయితే, ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన భార‌త యంగ్ ప్లేయ‌ర్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ మంచి ఇన్నింగ్స్ తో రాణించారు. తొలి రోజు స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. రెండో రోజు మ‌రో అరంగేట్రం ఆట‌గాడు ధృవ్ జురెల్ బ్యాట్ తో క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. 104 బంతులు ఎదుర్కొని 46 ప‌రుగులు చేశాడు. 4 ప‌రుగుల దూరంలో హాఫ్ సెంచ‌రీని కొల్పోయాడు. అయితే, అత‌ని ఇన్నింగ్స్ లో రెండు ఫోర్లు, మూడు సిక్స‌ర్లు రెండో రోజు మ్యాచ్ లో హైలెట్ గా నిలిచాయి.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయినప్పుడు, జురెల్‌కు బదులుగా నైట్‌వాచ్‌మెన్ కుల్దీప్ యాదవ్‌ను పంపాలని భారత్ నిర్ణయించింది. 2వ రోజు కుల్దీప్ ఔట్ అయిన త‌ర్వాత జురెల్ గ్రౌండ్ లోకి దిగాడు. టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి పరుగులు సాధించడానికి 11 బంతులు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత క్లాసిక్ ఇన్నింగ్స్ ను ఆడాడు. అయితే, ఇప్పటివరకు ఈ టెస్టులో అత్యంత ఆకట్టుకునే ఇంగ్లండ్ బౌలర్‌గా నిలిచిన మార్క్ వుడ్ గంటకు 146 కిమీ వేగంతో బౌన్సర్‌ను వేశాడు. దీనిని భ‌య‌ప‌డ‌కుండా పర్ఫెక్ట్ టైమింగ్ తో బంతిని ధృవ్ జురెల్ సిక్సర్‌గా మలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో జురెల్ మొదటి బౌండరీ గంట‌కు 146 కిలో మీట‌ర్ల వేగంతో మార్క్ వుడ్ వేసిన‌ బౌన్సర్ తో వ‌చ్చింది. అది కూడా సిక్స‌ర్. దీంతో పాటు లెగ్-సైడ్ ట్రాప్‌తో తన వికెట్‌ను పొందడానికి ప్రయత్నించిన మార్క్ వుడ్ బౌలింగ్ లో మ‌రో బౌండరీ కొట్టాడు. 

 

 

IND vs ENG: సెంచ‌రీ కోసం సర్ఫరాజ్ ఖాన్ ను బ‌లి చేశావా జ‌డ్డూ భాయ్.. ! రోహిత్ శ‌ర్మ కోపం చూశారా..?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios