India vs England 3rd Test: భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్టు తొలిరోజు భారత బ్యాటర్స్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలు కొట్టడంతో భారత్ పై చేయి సాధించింది. అరంగేట్రం మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన ఆటతో అదరగొట్టాడు.
Ravindra Jadeja-Sarfaraz Khan: దేశవాళీ క్రికెట్ లో సెంచరీల మోత మోగించి.. రికార్డు సగటుతో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్ ఎట్టకేలకు టీమిండియా తరఫున అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్ లోనే ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే భారత్ తరఫును అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీని సాధించాడు. సర్ఫరాజ్ ధనాధన్ బ్యాటింగ్, దూకుడు చూస్తుంటే సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ, జడేజా చేసిన పనికి రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు.
వరుసగా మూడు వికెట్లు పడిన తర్వాత ఈ మ్యాచ్ లో క్రీజులోకి వచ్చిన జడేజా నిలకడగా ఆడుతూ సెంచరీకి చేరువయ్యాడు. రోహిత్ శర్మ ఔట్ అయిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తో కలిసి భారత ఇన్నింగ్స్ ను కొనసాగించాడు. అయితే, 90 పరుగులకు చేరిన తర్వాత జడేజా సెంచరీ చేయడం కోసం చాలా బంతులు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ఒత్తిడి గురైనట్టు కూడా కనిపించాడు. అయితే, మరో ఎండ్ లో ధనాధన్ ఇన్నింగ్స్ తో సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నాడు. అతని ఊపు చూస్తుంటే మరో అద్భుతమైన సెంచరీ సాధించేలా కనిపించాడు. 90 పరుగుల నుంచి సెంచరీ చేయడానికి జడేజా తీసుకున్న బంతుల్లోనే సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ కొట్టాడు.
హార్దిక్ పాండ్యాకు ఝలక్.. టీ20 ప్రపంచకప్-2024 లో భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ !
ఈ తర్వాత తన దూకుడు మరింతగా పెంచి ఆడుతున్నాడు. అయితే, అప్పటికే సెంచరీ చేరువలో ఉన్న జడ్డూ భాయ్ ఒత్తిడిలోకి జారుకుని సర్ఫరాజ్ ఖాన్ ను తన సెంచరీ కోసం బలి చేశాడు. 99 పరుగుల వద్ద జడేజా పరుగు కోసం సర్ఫరాజ్ కు కాల్ ఇచ్చాడు. దీంతో సర్ఫరాజ్ పరుగు కోసం క్రీజు దాటి పరుగెత్తాడు. ఆ తర్వాత జడేజా పరుగు వద్దని చెప్పడంతో వెనుదిరిగాడు. అయితే, అప్పటికే ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ అద్భుతమైన త్రోతో వికెట్లను డైరెక్ట్ హిట్ చేశాడు. దీంతో మంచి ఊపులో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగుల వద్ద రనౌట్ గా వెనుతిరిగాడు. అక్కడ జడేజా రన్ కోసం కాల్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు.. దీనికి తోడు పరుగు కోసం కాల్ ఇచ్చిన అవతలి ఎండ్ లో నుంచి సర్ఫరాజ్ ఖాన్ పరుగుకోసం వచ్చిన తర్వాత వద్దని చెప్పి.. తన సెంచరీ కోసం సర్ఫరాజ్ ను జడేజా బలి చేశాడు.
దీంతో సోషల్ మీడియా వేదికగా రవీంద్ర జడేజా తీరుపై విమర్శలు వస్తున్నాయి. తన సెంచరీ కోసం సర్ఫరాజ్ ను బలి చేశాడనీ, సెల్ఫిష్ అంటూ కామెంట్లతో విరుచుకుపడుతున్నాయి. ట్విట్టర్ లో జడేజాను ట్రోల్స్ చేస్తూ #సెల్ఫిష్ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. జడేజా తీరుపై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సర్ఫరాజ్ రనౌట్ అయిన వెంటనే తన క్యాప్ ను తీసి గట్టిగా అక్కడి టేబుల్ పై కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
IND VS ENG 3RD TEST DAY 1 HIGHLIGHTS: రోహిత్, జడేజా సెంచరీలు.. సర్ఫరాజ్ ఖాన్ ధనాధన్ ఇన్నింగ్స్
