India vs England: భార‌త్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌న‌వ‌రి 25 నుంచి హైద‌రాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. అయితే, తొలి రెండు టెస్టుల‌కు విరాట్ కోహ్లీ దూర‌మయ్యాడు. 

India vs England-Virat Kohli : జనవరి 25 నుంచి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత స్పిన్నర్లు ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్.. భార‌త బ్యాట‌ర్స్-ఇంగ్లాండ్ బౌలింగ్.. ఉత్కంఠభరితంగా సాగ‌బోయే టెస్టు సిరీస్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది. తొలి రెండు టెస్టుల‌కు భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ దుర‌మ‌య్యాడు. 

భార‌త్-ఇంగ్లాండ్ తొలి రెండు టెస్టు మ్యాచ్ ల నుంచి విరాట్ కోహ్లీ దూర‌మ‌య్యాడ‌ని భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) వెల్ల‌డించింది. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో జ‌రిగే తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడని తెలిపింది. ఈ అనూహ్య నిర్ణయం క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించడంతో పాటు రాబోయే సిరీస్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండు పై మంచి రికార్డు ట్రాక్ క‌లిగిన విర‌ట్ కోహ్లీ రెండు టెస్టుల‌కు దూరం కావ‌డం భార‌త్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇంగ్లాండ్ తో జరిగే కీలక మ్యాచ్ ల‌కు కోహ్లీ అందుబాటులో లేక‌పోవ‌డం టీమిండియా ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మ‌రి !

Scroll to load tweet…