భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టుకు కౌంట్ డౌన్ షురూ.. వైజాగ్ లో జైత్రయాత్ర కొనసాగిస్తుందా?

India vs England: హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించి 5 టెస్టుల సిరీస్ లో 1-0 అధిక్యంలో ఉంది. రెండో టెస్టు విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇరు జట్ల పూర్తి వివరాలు గమనిస్తే..

 

India vs England 2nd Test: Countdown begins To Vizag Test, these are the players of both the teams  RMA

India vs England, 2nd Test: గెలిచే మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్నర్ల  చేతిలో టీమిండియా ఆటగాళ్లు బోల్తా కొట్టడంతో భారత్ 28 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే క్రమంలో స్టార్ ప్లేయర్లు దూరమైన టీమిండియా యంగ్ ప్లేయర్లతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శుక్రవారం నుంచి విశాఖపట్నం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని సిరీస్ లో ముందుకు సాగాలని భారత్ భావిస్తుండగా, సొంతగడ్డపై భారత్ ను ఓడించి మరో విజయంతో సిరీస్ ఆధిక్యం సాధించాలని ఇంగ్లాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.

స్పిన్నర్ల ఆధిపత్యం ఉన్న హైదరాబాద్ టెస్టులో భారత్ పై 28 పరుగుల తేడాతో విజయం సాధించి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. వైజాగ్ పిచ్ కూడా స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో ఇరు జట్ల స్పిన్నర్లతో పైచేయి సాధించాలని చూస్తున్నాయి. అయితే, తొలి మ్యాచ్ లో ఓడిన టీమిండియా రెండో టెస్టుకు ముందు సందిగ్ధంలో పడింది. ఒకవైపు కొందరు ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవడం, మరోవైపు తొలి మ్యాచ్ లో రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు ఈ మ్యాచ్ కు అందుబాటులో లేకపోవడం భారత్ కు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మిడిలార్డర్లో రాహుల్ స్థానంలో రజత్ పాటిదార్, జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దేశవాళీ క్రికెట్లో తన సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్ వరుసగా విఫలమవుతున్న శుభ్ మన్  గిల్ లేదా శ్రేయాస్ అయ్యర్ ల స్థానంలో బరిలోకి దిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. లేదా రాహుల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ను ఆడించే అవకాశం కూడా ఉంది.

భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది.. ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్

స్పిన్నర్ల జోరు !

విశాఖ పిచ్ మళ్లీ స్పిన్నర్లకు సహకరించే అవకాశం ఉండటంతో ఈ మ్యాచ్ లో భారత్ ఒక పేసర్ తోనే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. మహ్మద్ సిరాజ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. తొలి మ్యాచ్ లో ఒక పేసర్, ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లను బరిలోకి దింపి విజయవంతమైన ఆరంభాన్ని అందుకున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో నలుగురు స్పిన్నర్లను బరిలోకి దింపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అవసరమైతే నలుగురు స్పిన్నర్లను ఆడించడానికి వెనుకాడబోమని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. ఇక్కడ ఆడిన టెస్టు మ్యాచ్ లలో ఒక్క ఓటమిని కూడా చూడలేదు. 

రెండో టెస్టుకు టీమ్స్ అంచనాలు ఇవే.. 

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రజత్ పాటిదార్/ సర్ఫరాజ్ ఖాన్,కేఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్.

ఇంగ్లాండ్:జాక్ క్రాలీ, డకెట్, ఒల్లీ పోప్, రూట్, బెయిర్‌స్టో, స్టోక్స్, బెన్ ఫోక్స్, రిహాన్, హార్ట్లీ, మార్క్ వుడ్, బషీర్.

Budget 2024: 'గేమ్-ఛేంజర్' ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ కారిడార్ క‌థేంటో తెలుసా?

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios