India vs England 1st test Live day 1: అదరగొడుతున్న భారత బౌలర్లు, పెవిలియన్ పడుతున్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైంది. లంచ్ బ్రేక్ తర్వాత రెండో సెషన్ ఆట ప్రారంభమైంది.
హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య భోజన విరామం తర్వాత గురువారం నాడు మధ్యాహ్నం రెండో సెషన్ ఆట ప్రారంభమైంది.
లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి.తొలి టెస్ట్ మ్యాచ్ ను హైద్రాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇవాళ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
జాక్ క్రాలే, బెన్ డకెట్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. 11వ ఓవర్లో భారత జట్టుకు తొలి వికెట్ దక్కింది. రవి చంద్రన్ ఆశ్విన్ బౌలింగ్ లో డకెట్ ఎల్ బీ డబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. డకెట్ ఔట్ కావడంతో క్రీజ్ లోకి ఓలిపోప్ వచ్చాడు.
14వ ఓవర్ లో భారత జట్టు రెండో వికెట్ దక్కించుకుంది. జడేజా బౌలింగ్ లో ఓలిపోప్ ఔటయ్యాడు. ఓలిపోప్ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఓలిపోప్ ఔట్ కావడంతో జోరూట్ క్రీజ్ లోకి వచ్చాడు.
also read:IND vs ENG 1st Test Live Day 1: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
16వ ఓవర్లో ఇంగ్లాండ్ జట్టు మరో వికెట్ ను కోల్పోయింది. 16వ ఓవర్ తొలి బంతికే ఓపెనర్ క్రాలేను ఆశ్విన్ ఔట్ చేశాడు. క్రాలే కొట్టిన బంతిని మిడాఫ్‌లో హైద్రాబాద్ బౌలర్ సిరాజ్ క్యాచ్ పట్టాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. క్రాటే ఔటు కావడంతో బెయిర్ స్టో క్రీజ్ లోకి వచ్చాడు.
ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు 80 పరుగులు చేసింది. అప్పటికే ఇంగ్లాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 108 పరుగులు చేసింది. 25 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 108 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయింది.
లంచ్ బ్రేక్ తర్వాత తొలి రోజు రెండో సెషన్ ఆట ప్రారంభమైంది. లంచ్ బ్రేక్ తర్వాత ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఇంగ్లాండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. 32వ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 32వ ఓవర్ నాలుగో బంతికి బెయిర్ స్టో ఔటయ్యాడు.
35వ ఓవర్ లో ఇంగ్లాండ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది.రవీంద్ర జడేజా వేసిన 35వ ఓవర్ మూడో బంతికి జోరూట్ ఔటయ్యాడు. స్వీప్ షాట్ ఆడబోయిన జోరూట్ బుమ్రాకు క్యాచ్ అందించాడు.